రాజకీయాలలో సమానత్వంకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇప్పటి భారత దేశ రాజకీయాలలో మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లో అది లోపించింది. ఓట్లు అడిగేటప్పుడు రాజకీయ నాయకులు చూపే ప్రేమానురాగాలు గెలిచిన తర్వాత ఉండడం లేదు. తమ సొంత కార్యకర్తలనే కుల, మతాలతో ద్వేషిస్తూ దూషిస్తున్నారు. పార్టీలో వయస్సులో గల పెద్దవారిని సైతం తిట్లతో ముంచెత్తుతున్నారు.
అలాంటి ఇప్పటి రాజకీయాలలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన సమావేశంలో ప్రజలను మరొక్కసారి తన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారు. తన కోసం వేసిన ప్రత్యేక కుర్చీలో కూర్చోకుండా, తోటి వారు ఎలాంటి కుర్చీలో కుర్చున్నారో అలాంటి కుర్చీలో కూర్చొని పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని, ఆధిపత్యంలేని ధోరణిని, సమానత్వాన్ని చాటి చెప్పారు. అందరి పట్ల సమానత్వాన్ని చూపిస్తూ, ప్రేమానురాగాలు పంచుతున్న పవన్ కళ్యాణ్ గారు నిజమైన నాయకుడని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మన రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.