ఎటువంటి ఊహాగానాలను నమ్మకండి – శ్రీ కలవకొలను తులసి…
జనసేన అధినేత శ్రీ పవన్‌కళ్యాణ్ గారి గురించి మరియు జనసేన పార్టీకి సంబంధించి మొదటి నుంచి ఊహా జనిత వార్తలు రాస్తూ, జనసేన శ్రేణుల్ని గందరగోళానికి గురిచేయడం, తద్వారా రేటింగ్స్ సాధించి జేబులు నింపుకోవడం మీడియాలో ఓ వర్గం నిత్యం కృత్యంగా పెట్టుకుంది.
ఇందులో భాగంగానే బుధ-గురు వారాల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ గారి పోరాట యాత్ర తదుపరి షెడ్యూల్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సోమవారం నుంచి అంటే ఈ నెల 16 నుంచి జనసేనాని పశ్చిమ గోదావరి జిల్లాలో తదుపరి పోరాట యాత్రను కొనసాగిస్తారన్నదే ఆ వార్త సారాంశం. దీంతో జిల్లాలో టూర్ ఏర్పాట్లు ఎలా చేయాలి? అనే అంశాలపై జనసైనికులు చర్చలు మొదలు పెట్టేశారు. అయితే తదుపరి టూర్‌కి సంబంధించి అధికారికంగా ఎలాంటి షెడ్యూల్ ఖరారు కాలేదు. పార్టీ వర్గాలు కూడా సదరు తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, పార్టీ అధినేత స్వయంగా ప్రకటించడమో లేక ప్రెస్ నోట్ ద్వారానో, మీడియా విభాగం నుంచి మెస్సేజ్ రూపంలోనో తెలియపరుస్తూ వస్తోంది. అయినా ఇలాంటి అనధికారిక వార్తలు హల్ చల్ చేయడం, వాటిని నమ్మి జనసేన కార్యకర్తలు ప్రచారం కల్పించడం, గందరగోళానికి గురికావడం జరుగుతూనే ఉంది.. ఇప్పటి వరకు జనసేన అధినేత పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు కాలేదు. 16వ తేదీ నుంచి టూర్ అంటూ వస్తున్న వార్తల్ని ఖండిస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ కలవకొలను తులసి రావు గారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఊహాగానాలు నమ్మవద్దని పార్టీ శ్రేణుల్ని కోరారు. పోరాట యాత్ర తేదీలు ఖరారయ్యాక, జనసేన పార్టీ అధికారికంగా ప్రెస్ నోట్ ద్వారా ప్రకటిస్తుందని తులసి రావు గారు వెల్లడించారు.
జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి విషయాన్నయినా, పార్టీ అధికారికంగా ప్రకటించకుండా నమ్మి గందరగోళానికి గురికావొద్దని జనసైనికులకు మనవి.
Source : Pawan Today