IT గ్రిడ్ కేసులొ నారా లోకేశ్ కు నోటీసులు రానున్నాయా?

LOkesh

IT గ్రిడ్ కేసులొ నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం!!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న డేటా చోరీ కేసు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది.
ఒకవైపు IT గ్రిడ్ కంపెనీకి ఏపీలో అధికారపార్టీకి సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుంటే,హైదరాబాద్లో భద్రంగా ఉన్న డేటా ఎలా లీక్ చేస్తారు అంటూ అధికార పార్టీ ఆరోపిస్తుంది.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో మారు తీవ్రఉద్రిక్తతకు కారణమైన డేటా చోరీ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓ ఐటీ సంస్థ కు అందచేసిందని ,ఓ ప్రైవేట్ సంస్థ వద్ద ఇలా ప్రజల వివరాలు అన్ని
ఉంటే పరిస్థితి ఏమిటి అనే వాదనలు వినిపిస్తున్న నేపద్యం లో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

IT Grid Case

ఈ విషయంలో వైసీపీ నేతల నుండి ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.ఈ కేసులో ఎంత పెద్దవారు ఉన్న సరే విచారణ జరపాల్సిందే అంటూ సీపీ సజ్జనార్ అంటున్నారు.తాజాగా డేటా చోరీ కేసులో తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ కు నోటిసులు జారి చేస్తారంటూ ప్రచారం సాగుతోంది.అందుకు తెలంగాణ పోలీసులు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి . దర్యాప్తు లో తేలిన సంచలన విషయాల క్రమంలోనే లోకేష్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఏపి ప్రభుత్వం వద్ద భద్రంగా ఉండవలసిన ప్రజల డేటా వివరాలన్నీ లోకేష్ ఆఫీస్ నుంచే నేరుగా ఐటి గ్రిడ్ సంస్థకు అందినట్లుగా సైబరాబాద్ పోలీసులకు పక్కా ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది .అశోక్ తమ ముందుకు వస్తే కానీ ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందన్న భావనను వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్ అశోక్ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుపుతున్నారు .లొంగిపోవడానికి అశోక్ కి ఇచ్చిన గడువు కూడా ముగిసింది .దీనితో కోర్ట్ వారెంట్తో అశోక్ ను అరెస్ట్ చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్దపడుతున్నారు .మరోవైపు ఏపి ప్రభుత్వం అశోక్కు రక్షణ కల్పిస్తుందన్న అనుమానాలు కూడా తెలంగాణ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో నేరుగా నారా లోకేష్కే నోటీసులు జారీచేస్తే తప్ప ఈ కేసు ఓ కొలిక్కి రాదన్న భావన తెలుస్తుంది.

 

Source: DOT news

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *