జనసేన

జనసైనికులందరికీ చాలా ముఖ్యమైన రోజు. 2014 లో జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. ఈ అయిదేళ్లలో తెలుగు ప్రజలందరి ఆశీర్వాదంతో జనసేన పార్టీ ఒక మహాశక్తిగా ఎదిగింది. యువకులు, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలూ కులమతాలకు అతీతంగా పార్టీకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో అనేక విజయాలు సాధించడం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గర్వకారణం. రెట్టించిన ఉత్సాహంతో జనసేన పార్టీ 2019 ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతోంది.

మరికొద్ది రోజులలోనే జరగనున్న జనసేన ఆవర్భావ దినోత్సవ సభకు గోదావరి తీరాన ఉన్న చారిత్రాత్మక నగరం రాజమండ్రి వేదిక కానుంది. జనసైనికులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈసారి సభను ఇక్కడ జరపాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి. మార్చి 14 మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. విశాలమైన ప్రాంగణంలో సభకు కావలసిన ఏర్పాట్లను జనసేన ప్రతినిధులు చేస్తున్నారు.

జనసేన

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాజమండ్రి సభ ఒక తొలి అడుగు మాత్రమేననీ, విశాఖ, విజయవాడ వంటి ఎన్నో నగరాలలో జనసేన సభలు ఉంటాయనీ పార్టీ ప్రతినిథులు తెలిపారు. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా సభలో పాల్గొని ఆనందంగా ఇంటికి వెళ్లే విధంగా జనసేన ప్రతినిధులు భారీ ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.. ఈ భారీ భహిరంగ సభకు తరలి రావాలని అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు.

రాజమండ్రిలో జరగనున్న ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచీ 15మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బొమ్మదేవర శ్రీధర్ (బన్ను) ఆధ్వర్యంలో పనిచేస్తుందని పార్టీ కార్యలయం వెలువరించిన ఓ ప్రకటనలో తెలిపారు.

కమిటీ సభ్యుల వివరాలు:

ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి)
దుర్గేష్ (రాజమండ్రి)
బన్ని వాసు
పసుపులేటి సుధాకర్ (కావలి)
రాధమ్మ (అమలాపురం)
సరోజిని (Ex.మేయర్, కాకినాడ)
యామిని జ్యోత్స్న
పేసంగి ఆదినారాయణ (కాకినాడ)
పంతం నానాజీ (కాకినాడ)
నవుడు వెంకటరమణ (ఉంగుటూరు)
యర్రంకి సూర్యరావు (భీమవరం)
జి. శ్రీను బాబు (శ్రీకాకుళం)
రాపాక వరప్రసాద్ (రాజోలు)
కమలుద్ధీన్ (గుంటూరు)
దొమ్మేటి వెంటేశ్వరరావు (Ex.ఎమ్మెల్యే, కొత్తపేట)

https://www.facebook.com/janasenaku.addevvadu.9/videos/145493789811331/

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *