నేను ఇక్కడి గిరిజనులకు న్యాయం చేయమన్నానే కానీ పదవులు అడగలేదు, నేను ఏమి ఆశించకుండా ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తే వారు ప్రజా సమస్యల్ని వదిలేసి దోపిడీలు చేస్తున్నారు.
పాతపట్నం ప్రసంగం ముఖ్యాంశాలు :
* మేము 7 బలమైన సిద్ధాంతాలతో రాజకీయ పార్టీని స్థాపించాం, సైద్ధాంతిక బలం ఉంది, మీలా దోచుకోవటానికి వచ్చిన పార్టీ కాదు జనసేన
* నూరు గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలివానకు పడిపోయినట్లు, మీరు ఎంత దోపిడీలు, భయబ్రాంతులకు గురిచేసిన సరే త్వరలోనే మీ ప్రభుత్వం పడిపోతుంది
* ఎవరైతే దోపిడీకి, వంచనకి , అన్యాయానికి గురవుతున్నారో వారికి అండగా ఉంటుంది జనసేన
* ఓట్లడగటానికి వచ్చే నాయకులు సమస్యలపై నిలదీస్తే మాత్రం భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
* సమస్యలపై గళమెత్తండి, పోరాడండి, జనసేన మీకు అండగా ఉంటుంది
* ప్రత్యేక హోదా అనేది మన హక్కు, మీరు మీ హక్కుని ఉపయోగించుకొని అన్యాయం చేస్తున్న నాయకులను బలంగా ప్రశ్నించండి
* ధర్మపోరాట దీక్ష అంటున్న చంద్రబాబు గారు గతంలో హోదా సంజీవనా అని అన్నాడు, కానీ ప్రజలు హోదా బలంగా కోరుకుంటున్నారు కాబట్టే మాట మార్చారు
* తెదేపా గంగ పుత్రులకు,అడవి బిడ్డలకు మధ్య కుల చిచ్చు పెట్టింది, బ్రిటిష్ వారికి ఏ మాత్రం తీసిపోని విధంగా కులాల మధ్య చిచ్చు పెట్టి విద్వేష రాజకీయాలు చేస్తున్నది
* వంశధార నిర్వాసితులకు జనసేన అండగా ఉంటుందని నేను హామీ ఇస్తుంది, నేను మీ సమస్యలు తెలుసుకొని పోరాడేందుకు పాతపట్నం వచ్చాను.