రాజకీయ నాయకులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేరుతుంటే., జనసేన పార్టీ మాత్రం అలాంటి విలువలు లేని రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తోంది.
ఎలాంటి ఆశలు లేకుండా కేవలం పవన్‌కళ్యాణ్సైద్ధాంతిక బలం పట్ల నమ్మకం కలిగిన వ్యక్తులని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు, విద్యావేత్తలు, ఉన్నత భావాలు కలిగిన వ్యాపారవేత్తలు మాత్రమే జనసేన వైపు చూస్తున్నారు..
వీరందరి లక్ష్యం, ఆకాంక్ష ఓక్కటే జనసేనాని ఆశయ సాధనకి అనుగుణంగా పని చేయడం.. తాజాగా రాయలసీమ ప్రాంతం నుంచి ఇద్దరు ప్రముఖులు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.
అందులో ఒకరు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి చెందిన విద్యా సంస్థల అధినేత విశ్వం ప్రభాకర్‌రెడ్డి కాగా., మరొకరు రాయలసీమ ప్రాంతానికి చెందిన సుంకర శ్రీనివాస్. ఇరువురు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా కండువాలు కప్పించుకున్నారు.
విశ్వం ప్రభాకర్ కండువా కప్పించుకున్న అనంతరం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆశావహుల బయోడేటాల స్క్రీనింగ్ శిభిరంలో పాల్గొన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి తన అభ్యర్ధిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఇక భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న సుంకర శ్రీనివాస్., మొదట తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు..
మంగళగిరిలో పవన్‌తో పార్టీ కండువా కప్పించుకుని పార్టీలో చేరారు.. సుంకర రాజకీయ నాయకుడిగా కంటే రాయలసీమ వాసులకి ప్రముఖ వ్యాపారవేత్తగానే సుపరిచితులు.. సేవా తత్పరుడిగా కూడా ఆయనకి మంచి పేరుంది..
శ్రీనివాస్ చేరిక కడప జిల్లా జనసేన పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపనుంది..