ధవళేశ్వరం బ్రిడ్జి నుంచి జనసేన సత్తా ఏంటో రాష్ట్రం కాదు దేశమంతా తెలియాలి

ప్రత్యేక హోదా

Janasena Porata Yatra Highlights

ఈరోజు #విజయవాడలో->#తూర్పుగోదావరి జిల్లా నాయకులు,కార్యకర్తలతో #జనసేనఅధినేత
#పవన్_కళ్యాణ్ గారు సమావేశం–>#గోదావరి జిల్లా జనసేనకు చాలా బలమైనది,ఇక్కడ మనం బలం సంపాదించుకోలేకపోయాం అంటే అది మన బలం తప్పు కాదు,అది మన నాయకుల తప్పు…

Pawan Kalyan

ధవళేశ్వరం బ్రిడ్జి నుంచి జనసేన సత్తా ఏంటో రాష్ట్రం కాదు దేశమంతా తెలియాలి,అది ఎలా అంటే దద్దరిల్లిపోవాలి..

ఈ నెల 15 న తూర్పుగోదావరి లో ప్రవేశించిన దగ్గరనుండి పూర్తి జిల్లా పర్యటన అయ్యేవరకు దృష్టంతా ఇక్కడే ఉంటుంది,

మన జనసేనకు తూర్పుగోదావరి జిల్లా ఆయువుపట్టు,మీ అందరి సహకారాలు అందించండి…

Janasena Party Porata Yatra Highlights

Janasenakavathu

మనం కవాతు చేస్తున్నాం,అందరూ క్షేమంగా రావాలి,
అందరూ క్షేమంగా వెళ్ళాలి,,

ఎవరి భవిష్యత్తు కోసం అయితే వచ్చానో వారి ప్రాణాలు కోల్పోతే నా ఆశయ సాధన నిష్ఫలమౌతుంది…

ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ఇచ్చే నిర్ణయం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇస్తాయి,

కాబట్టి మనం గెలవాలా లేదా అనేది పూర్తిగా మన సమర్ధత మీద ఉంది..

మిమ్మల్ని తిరిగి తూర్పు గోదావరి జిల్లాలో కలుస్తాను. మార్పుని తూర్పు గోదావరి జిల్లాతో మొదలుపెడదాం…

చిత్తశుద్ధితో గోదావరి జిల్లా సమస్యల గురించి బలంగా మాట్లాడుతాను,నాయకులు చేయాల్సిందల్లా చెడగొట్టకుండా ఉంటే చాలు,
ఇంతమంది ప్రేమించే వారు ఉన్నా కూడా చెడగొట్టుకుంటే అది మన నాయకత్వ లోపం…

పొలవరంలో సర్పంచులతో మీటింగ్ పెడుతున్నాను, అధికార వికేంద్రీకరణ జరగాలి,దాని కోసం చర్చిస్తాం,
అందరికి అధికారం రావాలి,

వ్యవస్థలోని లాభాలు అందరికి పంచాలి అనేది నా ఉద్దేశ్యం…

Janasena Porata Yatra Highlights

Janasena Kavathu

డబ్బును అవసరం మేరకు ఖర్చుపెట్టండి,వృధా చేయకండి,అలాగే బెట్టింగులు లాంటి తప్పులను మీరు చేయకండి..

ఇతర పార్టీల్లాగా ఇంత నిధులు కావాలి, ఇంత ఖర్చు పెట్టాలి అని చెప్పను,

అంత అవసరాలు కూడా మన పార్టీకి లేవు…

నేను కోటరీలు కట్టడానికి వ్యతిరేకం,నేను పితాని బాలక్రిష్ణ గారికి మినహా ఎవ్వరికీ సీట్ ప్రకటించలేదు,

మరే ఇతర అభ్యర్థులకు ఇప్పటివరకు టిక్కెట్ ప్రకటించలేదు..అభ్యర్థుల ఎంపికకు ఒక కమిటీ ఉంటుంది,

ఎవరైనా మేము టిక్కెట్ ఇప్పిస్తాం అంటే నమ్మకండి,ఎవరికి ఆ శక్తి లేదు,నేనే ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాను…

కమిటీలు వేయడం కూడా ఒక ప్రయత్నంగా నేను భావిస్తున్నాను.

ఏ ఒక్కరికి కూడా ఇక్కడ సంపూర్ణ అధికారం లేదు.

నాతో సహా కేవలం బాధ్యత గానే తీసుకున్నాను..

ఏ ఒక్కరికి కూడా సంపూర్ణ అధికారం ఇవ్వలేదు,భాద్యతలు మాత్రమే ఇచ్చాను,

నాతో సహా,నిద్రాహారాలు మాని పనులు చేయాలి తప్ప అధికారం లాగా భావించకూడదు…

నేను ఇంత ఔన్నత్యం,విశాలమైన దృక్పథంతో ఉంటే

నేను బాధ్యత అప్పజెప్పిన కొంతమంది చిన్న ఆలోచన విధానంతోటి కనడటం నాకు ఇబ్బంది కలిగించింది…

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలోకి వచ్చి నడపడం,

జగన్మోహన్ రెడ్డి గారి నాన్న గారు ముఖ్యమంత్రి,

కాంగ్రెస్ అంతా వైసిపి లోకి రావటం సంస్థాగతంగా వారికి చాలా తేలిక…

నేను పాలసీలు గురించి మాట్లాడలనుకుంటా కానీ ఇద్దరి వ్యక్తుల గొడవల గురించి కాదు..

మనం ఒక కొత్తతరం, కొంతమంది అనుభవజ్ఞులు,

ఎక్కువశాతం సమాజం కోసం పనిచేద్దాం అనుకునే వ్యక్తులు ఉన్నారు,

రాటు తేలటానికి కొంత సమయం పడుతుంది…

అందరూ ప్రశ్నించే పార్టీ అని అంటారు,ప్రశ్నించడం మాత్రమే కాదు,

ప్రశ్నించడం ద్వారా అధికారంలోకి వెళ్లడం మన పార్టీ ముఖ్య ఉద్దేశం..

అధికారం మార్పులో భాగం కావాలి కానీ అధికారమే లక్ష్యం కాకూడదు…

Janasena Porata Yatra Highlights

చాలా మార్పు కోసం వచ్చాను,అందరికీ వ్యవస్థలో రావాల్సిన లాభాలను పంచాలి,

ఆడపడుచులు అందరూ కలిసి తూర్పు గోదావరి జిల్లాలో జనబాటను తలమానికంగా చేయాలి..

ఆడపడుచులకు, మహిళలకి, పెద్దలకి, వృద్దులకు కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి…

యుద్ధం చేసేప్పుడే శంఖం పూరించాలి,యుద్ధం ఎప్పుడు చేయాలో నేను చెబుతాను,

అప్పుడు మనం బలంగా శంఖం పూరిద్దాం,అప్పటి వరకు సంయమనం పాటించండి..

మీరు చేయాల్సిందల్లా విపరీతమైన సహనం,సంయమనంతో ఉండండి,

జనసేన ఎందుకు అధికారంలోకి రాదో చూద్దాం,ప్రతి ఒక్కరి గురించి,చిన్న సమస్య గురించి సమగ్ర అవగాహన ఉంది…

జనసేన 7 సిద్ధాంతాలని ముందుకి తీసుకెళ్లండి.

ఎందుకంటే ఈ సిద్ధాంతాలు చిన్న వాక్యాలు లాగా కనిపిస్తాయి కానీ దాని వెనకాల నా పాతిక సంవత్సరాల సాధన ఉంది…

నేను ఎక్కడికెళ్లినా ఎక్కువ యువత వస్తారు, సీఎం సీఎం అని అరుస్తారు,వారినుంచి కోరుకునేది ఏంటంటే జనబాట కార్యక్రమం ద్వారా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోండి…

ప్రతి ఒక్క జనసైనికుడు, ఆడపడుచు, ప్రతిఒక్కరూ కూడా జనబాట కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రానికే తలమానికం అయ్యేలా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీది…

పంచాయితీ ఎన్నికలు జరపకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే, అధికారం కొంతమంది చేతుల్లో ఉండిపోతుంది..SC, ST, వెనుకబడిన వర్గాలు, మహిళలు అధికారానికి దూరమయ్యారు..నిధులు పార్టీల స్థాయిలో ఉండిపోతున్నాయి, ప్రజలకు చేరువకావట్లేదు…

జన్మభూమి కమిటీలో తప్పులు గురించి జనసేన మాట్లాడినట్లుగా ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు, వారు వస్తే పధకం పేరు మారుతుంది తప్ప ప్రయోజనం కాదు, జనసేన అధికారంలోకి వస్తే అధికార వికేంద్రీకరణ చేస్తాం…

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *