చట్టసభల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తాం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు

0
1388
pawankalyanveeramahila

చట్టసభల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తాం

జనసేన పోరాటయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గల గాంధీ బొమ్మ సెంటర్ నందు నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :

* పాలకొల్లు సభకు రావడం నాకు ఎంతో ప్రత్యేకంగా వుంది. నాకు ఇంత ఘన స్వాగతం పలికిన అక్కచెల్లెల్లకి, పెద్దలకు, యువతకు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక నమస్కారం.

* యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప..గాయాలు,వేదనలు తప్ప…కలలు,కలలు తప్ప..పిరికితనం, మోసాలు తప్ప…మనకి అన్యాయం జరుగుతుంది కాబట్టే ఇక్కడికి పాలకొల్లు యువత ఇంత పెద్ద ఎత్తున వచ్చింది.

Pawan-Kalyan-s-Praja-Porata-Yatra-in-Chodavaram-Photos31

* పవన్ కళ్యాణ్ సభకి పిల్లలు వస్తారు అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఆ చిన్న పిల్లలే రేపు మీ ఇంట్లో వాళ్ల చేత జనసేనకి ఓటు వేయించండి. ఆ చిన్న పిల్లలే రేపటి భవిష్యత్తు, ఖనిజం.

* నాకు అవసరాలు లేవు, మీ అందరి దయ వల్ల సినిమాలలోకి వచ్చి 25 కోట్ల టాక్స్ కట్టే స్థాయికి వచ్చా…వాటన్నటికన్నా నా జీవితాన్ని మీకు అంకితం చేయడం ఇష్టం.

* మీ ప్రేమానురాగాల మీద నేను ఎప్పుడూ డబ్బు సంపాదించలేదు. బ్రాండ్ల పేరుతో డబ్బు సంపాదించలేదు. ప్రజా సంక్షేమానికి, కష్టాలు తీర్చడానికి, అవినీతి వ్యవస్థను అంతమొదించడానికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ వాడతాను తప్ప వ్యాపార సంస్థలకు వాడను.

చట్టసభల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తాం

Pawan-Kalyan-s-Praja-Porata-Yatra

* కష్ట పడే మనిషికి అండగా నిలబడాలని నా కోరిక. ఆడపిల్లలకి, అక్కచెల్లెల్లకి, భావితరం భవిష్యత్తు అయిన యువతికి అండగా ఉంటా… నా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నా..

* 2014లో రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు రెండు రాష్ట్రాలు నాకు రెండు కళ్ళు అంటే ఇప్పుడు ఒక కన్ను తెలంగాణాలో తీసేసారు.

* మా అమ్మని, మా ఇంటి ఆడపడుచులను దూషించే స్థాయికి వెళ్లిపోయారు. ఒక మంచి పాలన రావాలని నేను కోరుకున్నా, అందుకే వారి మాటలు పడుతున్నా..

* దశాబ్దాల అనుభవం వున్న నాయకులు వున్నా, యువతని పట్టించుకోవట్లేదే…అసలు వీళ్ళు ఉప్పు, కారం తింటున్నారా అనే బాధ కలిగింది.

pawan

* జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీ అంటున్నారు. అధికారం సాధించడానికి మొట్టమొదటి మెట్టు ప్రశ్నించడం.

* కులాలను, మతాలను, ప్రాంతాలను ముక్కలు ముక్కలుగా విభజించి కొన్ని కుటుంబాలు మాత్రమే లబ్ది పొందుతున్నాయి.

* ఈరోజున గోదావరి నీరు తాగడానికి లేకుండా పోయింది, నీరు కొనుక్కోవాల్సి వస్తుంది. దీని గురించి మాట్లాడేవారు, అడిగేవారు ఎవరూ లేరు.

* ఈరోజున జనసేన లేకపోయి ఉంటే సమస్యల మీద అడిగేవాడు ఎవరూ ఉండేవారు కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ప్రశ్నించాం..తరవాత అధికారాన్ని సాధిస్తాం, బడుగు బలహీన వర్గాల సాధికారతను స్థాపిస్తాం.

* గోదావరి జిల్లాలకు దిష్టి తగిలింది. మన పాలకొల్లులో తాగు నీటి సమస్య వుంది.

చట్టసభల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తాం

* పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు లోకేష్ గారికి మంచి స్నేహితులు అంట.

ముఖ్యమంత్రి గారికి గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయో లేదో తెలుస్తుంది కానీ 30 టన్నుల చెత్త కనపడట్లేదు.

* గృహ నిర్మాణం కింద ఇల్లులు కట్టేసారు, ఇంకా రుణాలు తీర్చలేదు. ఇది మీ దృష్టిలో వుందా ఎమ్మెల్యే గారు?

* పాలకొల్లులో 100 పడకల ఆసుపత్రిని మీ ఫ్రెండ్ లోకేష్ గారికి చెప్పి కట్టించొచ్చు కదా? రామానాయుడు గారు.

* పవన్ కళ్యాణ్ కి అనుభవం, పరిణీతి లేవు అంటారు, 2014లో

పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కి 15 సీట్లు గెలిపించడానికి మాత్రం పవన్ కళ్యాణ్ కావాలి.

* ముఖ్యమంత్రి గారు… మేము కబ్జాలకు వ్యతిరేకం, ప్రభుత్వ ఆస్తులను దోచుకోము అంటారు.

మరి ఈరోజున పంచారామ క్షేత్రమైన క్షీరారామలింగేశ్వర దేవాలయానికి చెందిన

7 ఎకరాల భూమి మీద మీ వారి కన్ను ఎందుకు పడింది?

* దోపిడీ చేసే తెలుగుదేశం నాయకుల మీద జనసైనికుల కన్ను పడింది. అన్యాయాన్ని ఎదురిస్తాం…

* మన పాలకొల్లుకి 42 సంవత్సరాల నుండి రెండు మంచి నీటి చెరువులే వున్నాయి,
ఇంకో చెరువు తవ్విద్దాం అన్నా…యడ్లబజారులో డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చమన్నా

ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా రావాలని అంటారు. ఏది చెప్పినా ప్రత్యేక హోదా అంటారు.

* ప్రత్యేక హోదా మీద నేను మాట్లాడుతూ పాచిపోయిన లడ్డులు అంటే ఆవురు,

ఆవురు అంటూ తెలుగుదేశం వారు ఆ పాచిపోయినవి తినేశారు.

* తెలుగుదేశం వారు.. చెయ్యాల్సిన పాడు పనులు,

విధ్వంసాలు చేసి ఇప్పుడు నవ నిర్మాణ దీక్షలు అంటున్నారు.

డబ్బులు వస్తాయి అనుకుంటేనే తెలుగుదేశం వారు ఒప్పుకుంటారు.

* అవినీతిలో కూరుకుపోయిన ప్రతిపక్ష నేత వస్తే అవినీతి పెరిగిపోతుంది అని రిస్క్ చేసి

2014లో తెలుగుదేశానికి మద్దతు తెలిపితే వీళ్ళు చేసేది దోపిడీలు, అక్రమాలు.

చట్టసభల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తాం

* మన దగ్గర డబ్బులు లేవు, ఛానెళ్లు లేవు, పేపర్లు లేవు,

వేల కోట్లు లేవు గాని మీ అందరి గుండెల్లో లక్షల టన్నుల ప్రేమ వుంది. నాకు అది చాలు.

* కొంతమంది డబ్బు వున్న వారు ఇంకా ఎదుగుతున్నారే తప్ప పేద వారు కాదు.

పక్షికి కూడా గూడు ఉంటది కానీ, ఇక్కడ కనీసం ఉండడానికి ఇల్లులు లేవు. తాగడానికి నీళ్లు లేవు.

* నేను చిన్నప్పుడు చాలా సమస్యలను చూసాను.

నాకు ఇంత స్టార్ డమ్ వచ్చినా గాని నా గుండె ఇంకా సామాన్యుడి దగ్గరే కొట్టుకుంటుంది.

* నా దగ్గరకి చాలా మంది వచ్చి సమస్యలు చెప్పేవారు.

నా దగ్గర వేల కోట్లు ఉంటే వాళ్లకి ఇచ్చేసేవాడిని.

వారందరికీ న్యాయం రాజకీయాల ద్వారా మాత్రమే చెయ్యగలం అని నమ్మి నేను రాజకీయాల్లోకి వచ్చాను.

* నేను రాజకీయాల్లో ఎదగాలంటే మోదీ గారి ద్వారా కేంద్ర మంత్రిని అయ్యి ఉండొచ్చు,

డబ్బు సంపాదించొచ్చు కానీ నాకు డబ్బులు కొత్తా కాదు, పేరు కొత్తా కాదు.

* చిన్నప్పుడు మా నాన్న నాకు కులం చెప్పలేదు, మానవత్వం అనే సంస్కారం మాత్రమే నేర్పాడు.

* నేను కులాలను వేరు చెయ్యను. మత్స్యకారులకు, ఎస్టీలకు గొడవలు పెట్టను…

కాపులకి, బీసీ లకు గొడవలు పెట్టను…మాల, మాదిగ కులస్థుల మధ్య గొడవలు పెట్టను చంద్రబాబు గారిలా…

జగన్ గారిలా కాపుల విషయంలో మాట మార్చిన విధంగా నేను రాజకీయం చెయ్యను…

ముస్లిమ్స్ కి మతం పేరు చెప్పి అభివృద్ధి లేకుండా బీజేపీలా చెయ్యను.

నాకు మనుషులంతా ఒక్కటే…అందరికీ సమాన న్యాయం చెయ్యగలను.

* ముఖ్యమంత్రి అనే వ్యక్తి ధర్మ కర్త. మనం కష్ట పడి సంపాదించి కట్టిన టాక్స్ డబ్బులు అందరికీ పంచాలి.

మూడు దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారి కుటుంబం చేతిలోనూ,

కొన్ని దశాబ్దాల కాలం కాంగ్రెస్ కుటుంబం చేతిలోనూ అధికారం ఉండిపోయింది.

కొన్ని కుటుంబాల చేతిలోకి అభివృద్ధి ఫలాలు వెళ్లిపోతున్నాయి.

చట్టసభల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తాం

* పవన్ కళ్యాణ్ కి కుల ముద్ర వేసి, కులానికి అంటగడదామని ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు.

నేను చిన్నప్పటి నుండి ఈ ఆట చూస్తున్నా..

నేను కష్టం వస్తే ఆడపడుచులకు అండగా ఉంటా గాని కులాన్ని చూడను.

* ఈ వ్యవస్థ మారాలంటే అందరికీ సమానమైన ప్రాతినిధ్యం ఇస్తే తప్ప భారతదేశ సమాజం బాగు పడదు, కులాల దోపిడీ ఆగదు.

* జనసేన పార్టీ 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తుంది.

చట్టసభల్లో ఆడపడుచులు ఉండాలి. ఒక ఆడ బిడ్డ కష్టం, ఆత్మగౌరవం,

ఆకలి బాధ ఒక ఆడపడుచుకే తెలుస్తుంది.

* రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం వారు అండగా నిలబడ్డారు. మిమ్మల్ని ఏమనాలి?

* గ్యాస్ సిలండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత జనసేన పార్టీది.

* రూపాయికి బియ్యం ఇస్తున్నారు. అది తినే బియ్యమా? 1 రూపాయికి ఇచ్చే బియ్యం 23 రూపాయలకు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ప్రతీ ఇంటి ఆడపడుచుకు 2500 నుండి 3500 ఇస్తాం..

ప్రజలు ఏం తినాలో ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పడానికి, ప్రజలు ఇష్టం వచ్చింది తినాలి.

* ఒక బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీ కావాలి.

ఒక ప్రాంతంలో 70% కంటే ఎక్కువ మంది మద్యపాన నిషేదానికి అంగీకరిస్తే అక్కడ లిక్కర్ షాపులు తీయించేస్తాం…

* తెలుగుదేశం వారు జనసేన పార్టీకి జెండా, అజెండా లేదు అంటారు.

అవి లేకపోతె ఇంత జనసమూహం వుంటదా? అది తెలుగుదేశం వారికే తెలియాలి.

* పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కులాన్ని నమ్ముకోలేదు, కులాన్ని గౌరవించాడు.

* ప్రతీ కులం తాలూకు కష్టం ఆ కులస్థుడికే అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here