ఈరోజు #చిత్తూరు లో #మీడియా సమావేశంలో #పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ->#రాయలసీమ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తీసుకుంటాం.. రాయలసీమ చదువుల నేల…అన్నమయ్య, వెంగమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి, పీర్ బాబా వంటివారు తిరగాడిన నేల..ఇలాంటి నేలకు ముఠా, వర్గ పోరుతో కొన్నికుటుంబాలు చెడ్డపేరు తెచ్చారు.. మళ్లీ ఈ నేలకు పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాము.
అభివృద్ధి చేయాలంటే వర్గ పోరాటాల నుంచి విముక్తి కలిగించాలి…కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలో తమ దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. రాయలసీమలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉన్నా పరిశ్రమలు రాకపోవడానికి, అభివృద్ధి జరగకపోవడానికి కారణం కొన్ని కుటుంబాలే.
రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చినా..అభివృద్ధి కొన్ని కుటుంబాలకే పరిమితం కావవడంతో మెజార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు…ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు…వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న పార్టీలు వారి అభివృద్ధికి మాత్రం పాటుపడటం లేదు…ప్రైవేటు పరిశ్రమల కోసం సహకార సంఘంలో పనిచేస్తున్న విజయడెయిరీ, చిత్తూరు సుగర్ పరిశ్రమలను నష్టాల పేరు చెప్పి చంపేశారు.
జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని తిరిగి తెరిపిస్తాం..రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా మతాలకు స్మశానవాటికలు చూశాం కానీ, చిత్తూరులో మాత్రం కులాలకు స్మశానవాటికలు ఉండటం చూసి బాధేసింది. కుల జాడ్యం ఎంతలా పేరుకుపోయిందో ఇలాంటివి చూస్తే అర్ధమవుతుంది. కులాలను కలిపే ఆలోచన విధానమే జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. అన్ని కులాలు, మతాలకు సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తాం.
ఏడాదికి 75 % యువత పట్టభద్రులు అయితే అందులో 50 % మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది..ఇలాంటివి మారాలంటే బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి…ప్రజలందరికి ఉపయోగపడే పరిపాలన వ్యవస్థను జనసేన పార్టీ తీసుకొస్తుంది..అద్భుతాలు చేస్తామని చెప్పము కానీ..సమస్యలకు పరిష్కర మార్గాలను వెతుకుతాము.