ఎవరు బెస్ట్ సీఎం?… అరిస్టాటిల్ ఏం చెప్పాడు?

Who is best CM

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్న వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి? ఢిల్లీలో నిన్న నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో నటుడు శివాజీ మాట్లాడుతూ ఈ ప్రశ్నను లేవనెత్తి… బీఏ చదువుకున్న వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి, ఇంటర్ మాత్రమే చదువుకున్న పవన్ కళ్యాణ్ లకు సీఎం అయ్యే అర్హత లేదన్నట్లుగా మాట్లాడారు. ఎంతో మంది ఐఏఎస్ లతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని వీరిద్దరూ అలా అనుకోవడం సరికాదని నటుడు శివాజీ వాక్రుచ్చారు. పవన్ కళ్యాణ్, జగన్, చంద్రబాబుల్లో చంద్రబాబు ఒక్కరికే సీఎం కుర్చీలో కూర్చునే అర్హత (శివాజీ మనసులో ఉన్నది వారి సొంత సామాజిక వర్గం అని..) ఉందని అన్నారు. సరే అందరూ చప్పట్లు కొట్టారు. శివాజీ చెప్పింది చెత్తా.. లేక అందులో నిజం ఉందా?.. తరచి తరచి చూద్దాం.

సీఎం లేదా ప్రజల్ని పరిపాలించడానికి పరిపాలకుడికి ఉండాల్సిన అర్హత ఏమిటి? దీని గురించి గ్రీకులు ఏమని భావించారో ముందు చూద్దాం. ఎందుకంటే ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని అందించింది వారే.

1. అరిస్టాటిల్: ఆచరణాత్మకమైన తెలివితేటలు ఉండాలి. ఈ ఆచరణాత్మకమైన తెలివి తేటలకు తోడు తిరుగులేని రీతిలో నైతిక వర్తన లేదా నీతి ఉండాలి. నీతిగా ఉండటం నాయకుడికి అత్యవసరమైన లక్షణం. పెరిక్లెస్ లేదా అలాంటి మనుషులకు ఆచరణాత్మకమైన తెలివి తేటలు ఉన్నాయని చెప్పేది అందుకే. వారికి ఏది మంచిదో గ్రహించగలరు అలాగే, మానవాళి మొత్తానికీ ఏది మంచిదో గ్రహించగలరు’’

అబ్రహాం లింకన్

విశ్లేషణ: ఆచరణాత్మక తెవివి తేటలు ఉండటం అంటే.. చేయగలిగిన పనులనే ఆమోదించాలి అని అర్థం. నాయకుడికి నైతికత కూడా ఉండాలంటున్నాడు అరిస్టాటిల్. మరి ఈ విషయంలో జగన్, చంద్రబాబులకు నైతికత విషయంలో మార్కులు సున్నా. నైతికత అనే అంశంలో పవన్ దరిదాపులకు కూడా మిగిలిన ఇద్దరు అభ్యర్ధులూ రారు.

2. అబ్రహాం లింకన్: గొప్ప రాజనీతి కలిగిన పాలకుడుగా అబ్రహాం లింకన్ కావడానికి ఆయన పాటించిన నియమాలు:

Abraham Lincoln

1. భిన్నాభిప్రాయాలను వినడం, 2. తప్పులను సరిదిద్దుకుంటూ నేర్చుకోవడం, 3. విజయం లభించినపుడు దానిని అందరికీ పంచడం, 4. ఓటమి వచ్చినపుడు బాధ్యతను స్వీకరించడం, 5. అవకాశం ఇవ్వడం, వైఫల్యం ఉన్నపుడు పని చేయని వారిని తీసివేయడం, 6. భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ, 7. తగిన విశ్రాంతి తీసుకోవడం, రేపటికి అవసరమైన ఉత్సాహాన్ని నింపుకోవడం, 8. లక్ష్యాలకు కట్టుబడి ఉండటం, 9. లక్ష్యాల గురించి కింది వారికి స్పష్టంగా చెప్పగలగడం. 10. అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లిపోయి పరిశీలిచడం.

విశ్లేషణ: అబ్రహాం లింకన్ అమెరికా తొలి అధ్యక్షుడు. అంత గొప్ప మేథావినీ చరిత్రలో చూడలేదని నేటికీ అమెరికన్ ప్రపంచం ఆయన్ను ఆరాధిస్తుంది. పవన్ కళ్యాణ్ లాగా.. లింకన్ సొంతంగా ఇంటిపట్టున ఉండి చదువుకున్నాడు. లింకన్ ది వానాకాలం చదువే. బడికి పెద్దగా వెళ్లింది లేదు. కానీ నిరంతరంగా కొత్త విషయాలను తెలుసుకున్న నిత్య విద్యార్ధి. అంతర్గత యుద్ధ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఒకటిగా చేసి… అమెరికాను సగర్వంగా నిలిపిన మహానేతగా కీర్తిని సంపాదించాడు. అబ్రహాం లింకన్ లాగనే పవన్ కళ్యాణ్ కూడా అనుకోవచ్చు. పవన్ కాకపోతే ఇంటర్ వరకూ చదువుకున్నారు. తర్వాత అంతా స్వీయ అధ్యయనమే. అబ్రహాం లింకన్ పాటించిన 10 సిద్ధాంతాలనూ పవన్ పాటిస్తుంటారు. చివర్లో 10 పాయింటు చూడండి. అవసరమైతే క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించడం. వంతాడ గనుల బాగోతాన్ని స్వయంగా వెళ్లి వాటిని వెలుగులోకి తెచ్చారు పవన్ కళ్యాణ్. లింకన్ ఖాళీ దొరికినప్పుడల్లా అమెరికన్ కాంగ్రెసు లైబ్రరీకి వెళ్లి చదువుకునేవారు. అందరూ నవ్వుకున్నా ఆయన ఆ పని చేయడం మానలేదు. ఫలితం.. గొప్ప నేత ఆ దేశానికి లభించారు. లింకన్ నాయకత్వ లక్షణాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

సీఎం కావడానికి ఉండాల్సిన తొలి అర్హత: నీతిగా ఉండటం. అది పవన్ కళ్యాణ్ కు ఉన్నది. బిడ్డను సాకడానికీ… ప్రేమతో పెంచడానికీ కావాల్సింది మాతృ హృదయం. ప్రజల్ని పరిపాలించడానికి కావాల్సింది ఏమై ఉంటుంది? వాళ్ల కష్ట సుఖాలను అర్ధం చేసుకోగలిగిన మనస్సు ఉండాలి. గత 70 ఏళ్లుగా మన నేతలు ఏమైనా చేస్తున్నారా? అధికారం కోసం పోరాటాలూ, ఒకరిపై మరొకరి విమర్శలూ.. రాజకీయాలంటే ప్రజల్లో ఒక రకమైన ఏహ్యతా భావాన్ని సృష్టించారు. రాజకీయాలంటే ఛీ అనుకునే పరిస్థితి తెచ్చారు.

janasena1

చర్చించడం మంచిదే

పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే.. రాజకీయాల్లో నీతి గురించి కనీసం చర్చ ప్రారంభమైంది. చర్చించండి.. ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్న చర్చ మంచిదే. ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా చర్చించడం మంచిదే. పవన్ వచ్చిన తర్వాతనే యువత మొత్తం రాజకీయాలపై దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వినూత్నమైన మార్పు ఇది. ప్రజల్లో మార్పు తేగలిగిన శక్తి అందరికీ ఉండదు. అబ్దుల్ కలాం విషయంలోనూ ఇదే జరిగింది. కేవలం తన చదువు వల్లనే అందరూ ఆయన్ని ఆరాధించడం లేదు. వ్యక్తిత్వమే ఆయనకు ఆభరణం అయింది. ఇప్పటి వరకూ ఉన్న కాంగ్రెసు, టీడీపీ రాజకీయాల్లో నన్నపనేని రాజకుమారి తప్ప పెద్దగా ఎవరూ కనిపించరు. ఈమే రెండు పార్టీల్లో ఉంటారు. జనసేన వచ్చిన తర్వాత.. ఎంత మంది మహిళలు జనసేన తరఫున వచ్చారో చూడండి. నమ్మకం కూడా ముఖ్యం. ఇతర పార్టీల్లో మహిళలను పార్టీ నేతలు ఎలా చూస్తారో తెలిసిందే. జనసేన ఇపుడు చదువుల తల్లిలా కనిపిస్తోంది. అదే ఒక కళాశాలను తలపిస్తోంది. అందరూ విద్యాధికులే. మేథావులూ, సైంటిస్టులూ వస్తున్నారు. యువత ఈ దేశపు హృదయ స్పందన. ఎక్కడ కదలిక ఉంటుందో అక్కడ లైఫ్ (రెండు రకాలుగా కూడా) ఉంటుంది. కదలికలేక, రాలిపోయిన పసుపు రంగు ముదరు ఆకుల్లో ఆకర్షణ లేదు. చిగుళ్లు అందంగా ఉంటాయి. రేపటి ఆకాంక్షలకు గుర్తు. అవి చిగురిస్తూ ఉంటే గుండెల్లో ఆనందం ఉప్పొంగుతుంది. ఇన్ని మానవ స్పందనలు మీకు ఏ ఇతర పార్టీల్లో లభించవు. పవన్ కళ్యాణ్ అధికారాన్ని ఎంజాయ్ చేద్దామని రావడం లేదు. యువత ముఖాల్లో, శాశ్వతంగా వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుదామని చూస్తున్నాడు. ఈ కోరికలో స్వార్థం లేదు. ఉంటే అంతమంది ఎందుకు ఆయన కోసం ఆరాటపడతారు. ఉత్తగా ఒక వ్యక్తిని ఎవరూ గౌరవించరు.

డబ్బు ఉండటమే అర్హతా..?

సీఎం కావడానికి కోట్లాది రూపాయలు సొమ్ములు ఉండాలనీ, పార్టీ పెట్టుకుని వెనుక మందీ మార్బలం ఉండాలనీ, బిర్యానీలకూ, ఓట్లకూ డబ్బులు ఖర్చు చేయడానికి పెద్ద యంత్రాంగం ఉండాలని భావిస్తుంటారు. ఇది పాత లెక్క. ఈ లెక్కలోనే పార్టీ పెట్టుకుని హంగూ ఆర్భాటం చేసే వారి గురించి చెప్పడం, విశ్లేషించడం వద్దనిపిస్తోంది. తొలి అడుగుల్లోనే నేర చరిత్ర ఉన్నపుడు మాట్లాడటానికేం ఉంది?

money

ఏ మార్పూలేని వ్యవస్థతో పోరాడుతూ, ఆ వ్యవస్థలోని దుర్మార్గాలతో పోరాడుతూ, కరుడు గట్టిన సంప్రదాయాలతో పోరాడుతూ, వెనుక మీడియా దన్ను లేకపోయినా, నమ్మిన సిద్ధాంతాలే మేలు చేస్తాయని భావించి గుండె ధైర్యంతో నేను అడవిని సైతం జయిస్తానంటూ బయల్దేరని పవన్ కళ్యాణ్ లో మాత్రమే నాయకుడు, ప్రజా నాయకుడు కనిపిస్తాడు. సీఎం కావడానికి ఇంతకంటే పెద్ద అర్హతలేమీ అవసరంలేదని ఎవరికైనా అర్థం అవుతుంది.

బాబు: రైలు పట్టాతో వికసించిన రాజకీయం!

చంద్రబాబు వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ చదువుకున్నారు. కళాశాల విద్యార్ధి ఎన్నికల కోసం ఆయన పీలేరు నుంచి రైల్లో వస్తున్న ప్రత్యర్ది పార్టీ విద్యార్ధులను సకాలంలో కళాశాలకు రానివ్వకుండా ఉండటానికి..ముందు రోజే రాత్రికి రైలు పట్టాను తొలగించారు. రైలు ఆగిపోయింది. అందుకు ఒక రైల్వే కూలీని ఉపయోగించుకున్నారని ఇప్పటికీ చిత్తూరులో దీనిని కథలు కథలుగా ప్రజలు చెప్పుకుంటారు. బాబు ఆ ఎన్నికల్లో గెలిచారు. కాలేజీ ఎన్నికలకే ఇలా చేసిన నారా చంద్రబాబు… అసలు ఎన్నికల కోసం ఏమైనా చేస్తారని ఊహించవచ్చు.

గరుడ శివాజీ కారణంగా ఈ స్టోరీ రాయాల్సి వచ్చింది. ఇంట్లో పనికి రాని వస్తువులను కొందరు అమ్ముకుంటారు. ఫర్వాలేదు. ఈ జాబితాలో కొందరు వ్యక్తిత్వాన్ని ప్యా‘‘కేజీ’’ల చొప్పున అమ్మేసుకుంటారు. అలాంటి వారి గురించి ఏం చెబుతాం?

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *