జనసేన పార్టీ శిక్షణా తరగతులు ఉత్తరాంధ్ర నుండి మొదలవుతాయి అని జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ శిక్షణా తరగతుల గురించి జనసేనాని ఈ విధంగా స్పందించారు.
నా జనసైనికులకు…
“పోరాటం చేసే వారికి తెగువ తో పాటు సమర్ధత మరియు విషయ పరిజ్ఞానం ఉండాలి (మార్గం) తెలిసి ఉండాలి”
సరికొత్త రాజకీయ చైతన్యం లక్ష్యంగా కృషి చేస్తున్న మన జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాలలో బూత్ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనుంది.
ప్రజలలో ఏళ్ళ తరబడి కొనసాగుతున్న భేదాభిప్రాయాలు, వైషమ్యాలు సమూలంగా తొలగించడానికే ఈ ప్రయత్నం.
“శాసించే వారు కాదు…ప్రజలని ప్రేమించే వారే నాయకులు. ప్రాధమికంగా కొంత మంది మాత్రమే కాదు అంతర్గంగా మీలో కూడా నాయకులు ఉన్నారు అని నేను బలంగా నమ్ముతున్నాను. వైజాగ్ అంబేద్కర్ భవన్ లో జరిగిన సమావేశంలో నేను ఇదే ప్రస్తావించాను.
ఈ శిక్షణా కార్యక్రమాలు దేవ్ గారు మరియు వారి టీం నిర్వహిస్తారు.
జనసేన పార్టీ తరపున బొమ్మదేవర శ్రీధర్ గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
సుమారు 6 గంటల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమానికి మీరు హాజరై క్రమశిక్షణతో వారి శిక్షణ లో పరిపూర్ణులు అవ్వాలని ఆశిస్తున్నాను.
నాయకులు ఎందరో రాజకీయాల్లోకి వస్తూ, వెళ్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడూ నాతోనే ఉంటారు.
మనం సైనికులం.
కార్య సాధకులం.
గుర్తుంచుకోండి. ఇది మన సేన ….జన సేన. జనసేన పార్టీకి మీరే జవసత్వాలు. మీరే నా బలం. మనమంతా ఒక దళం.
భావి తరాలకు నిజాయితీ తో కూడిన రాజకీయ వ్యవస్థ అందించాలనే మన సంకల్పానికి ఇది తొలి అడుగు…
మన ఆలోచనలు, ఆశయాలు ఈ వేదిక ద్వారా మరింత బలపడతాయని విశ్వసిస్తున్నాను అని తెలిపారు.