ప్రత్యేక హోదా కోసం ప్రజలందరి పక్షాన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటూ జనసేన అధ్యక్షుడు కొన్ని సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాకు హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీనే ముద్దు అన్న సమయాన ఆంధ్ర రాష్ట్రంలో గల ప్రముఖ నగరాలలో జనసేన అధ్యక్షుడు ప్రత్యేక సమావేశాలు పెట్టి గొంతు చించుకుని మాకు ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్ గారి డిమాండ్ ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చెయ్యడమే గాక హోదా కొరకు చేస్తున్న పోరాటాన్ని నీరు గార్చారు. ఆ తరువాత కూడా అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కి హోదా ఎంతో ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. గత పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు కేంద్రం మీద ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టండి నేను మద్దతు కూడా కడతా అని ఆంధ్రప్రదేశ్ ఎంపీ లకు జనసేనాని సలహా ఇస్తే ఆ సమయంలో ఆంధ్ర ఎంపీ లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన సంగతి మనకి తెలిసిందే!
ప్రత్యేక హోదా వద్దు అని చెప్పిన తెలుగుదేశం నాయకులే ఆ తర్వాత హోదానే ముద్దు అని మాట మార్చారు. దశాబ్దాల అనుభవం వుంది, మేము అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యగలం అని చెప్పుకునే నాయకులకు హోదా మీద ముందు చూపు లేకపోవడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. హోదా మీద గళమెత్తాల్సిన సమయాన వైస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చెయ్యడం, వారికి ఆంధ్ర ప్రజల మీద వున్న నిర్లక్ష్య దోరణని మరొకసారి తెలియజేసింది.
పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యిన సందర్భంగా జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హోదా ఇవ్వాలని ప్రజలందరి పక్షాన కోరుతున్నాను అని తాజాగా మరొక్కసారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, టీడీపీ మరియు బీజేపీ వృధా చేసాయని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ పై వున్న కోపంతో బీజేపీ…హోదాను నిరాకరించడం తగదన్నారు. హక్కుల సాధనపై ఒత్తిడికి పార్లమెంట్ కంటే మంచి వేదిక లేదని, పార్లమెంటే అత్యుత్తమ ప్రజాస్వామ్య వేదిక అని సూచించారు.
టిడిపి ఎంపీల అవిశ్వాస తీర్మానంపై జనసేనాని స్పందన.