పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీకి ప్రతిరూపం అన్న బలమైన నమ్మకం ప్రజల్లో నాటుకుపోతోంది. వారి మనసుల్లో ఆయన వేసిన ముద్ర అలాంటిది. అప్పటికే మెగాస్టార్ చిరంజీవి పాపులారిటీని బీట్ చెయ్యడం అసాధ్యమని డిసైడైపోయిన తెలుగు హీరోల లక్ష్యాన్ని పవన్ కళ్యాణ్ మరో కాంతి సంవత్సరం దూరం నెట్టేశారు. సెలబ్రిటీలలో అరుదుగా తారసపడే దయాగుణం, అందరినీ సమభావంతో చూడడం ఇవన్నీ ఆయన్ని సినిమా అభిమానులే కాదు, తెలుగు వారందరి దృష్టిలోనూ ఎంతో ఉన్నతంగా నిలబెట్టాయి. సినిమా బాలేదన్నా నష్టం రాని స్థితికి వెళ్లిపోయిన ఆయన లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ నమ్మశక్యం కాదు. కానీ అది నిజం.. సినిమా నటుడిగా కన్నా మరేదో విశేషం ఆయనకి కోట్ల మంది అభిమానుల్ని తెచ్చింది.
https://www.facebook.com/balu.manku.3/videos/401082537368373/
టాప్ స్టార్ గా తన సినీ కెరీర్ ను వదులుకుని పవన్ రాజకీయాలలోకి వచ్చారు. అన్న చిరంజీవి పార్టీకి తగిలిన ఎదురుదెబ్బతో ఇక ఆ ఫ్యామిలీ రాజకీయాల జోలికి రాదని పార్టీలన్నీ నిశ్చింతగా ఉన్న సమయంలో సింహంలా గర్జిస్తూ పవన్ కొత్త పార్టీని ఎనౌన్స్ చేశారు. అదో సంచలన ప్రకటన. మొదట్లో అంతా ఏదో ఆవేశంలో ప్రసంగిస్తున్నాడని అనుకున్నారు. కానీ అంతలోనే వచ్చిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతిస్తూ ప్రచారం చేశారు. ‘గెలుపు ఖాయం’ అనే పరుపు మీద హాయిగా నిద్రపోతున్న వైసీపీ ఆశలపై నీళ్లు చల్లాకే అర్థమైంది సింహం పంజా దెబ్బ రుచి. అయినా ఓట్ల తేడా ఒక శాతం, రెండు శాతం మాత్రమే అంటూ వైఎస్సార్ పార్టీ నాయకులు సమర్థించుకున్నారు. కానీ 2009లో ఇప్పటి ఏపీ పది జిల్లాలు లెక్కిస్తే నుంచి 53 సీట్లను మాత్రమే గెలిచిన టీడీపీ 2014కు 103 సీట్లు ఎలా గెలవడం వెనుక నిలబడింది పవన్ పవర్ అని రెండు పార్టీలూ చెప్పుకోవు.
రానున్న 2019 ఎన్నికల ఫలితాలు కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వెయ్యలేక పోవడానికి కారణం మళ్లీ పవన్ కళ్యాణ్. ఇదే సరిగ్గా ఆ రెండు పార్టీల్లో గుబులు రేగేలా చేసింది. 2018 మర్చి 14 న జనసేన ఆవిర్భావ సభలో తాను మద్దతిచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ నాలుగేళ్ల పాలనని రివ్యూ చేశారు. తెలుగుదేశం పార్టీ కింద భూమి కంపించింది. మామూలుగా కాదు. లక్షలాది ప్రజల మధ్య టీవీలన్నీ లైవ్ ఇస్తున్న సమయంలో పవన్ ప్రళయ కాల రుద్రుడిలా టీడీపీ అవినీతిపై విరుచుకుపడ్డాడు. చోటా నాయకుల దగ్గర్నుంచి మంత్రి లోకేష్ వరకూ అందరి జాతకాలూ చెప్పి జనసైనికులకు నాలుగు రోజుల (ఉగాది) ముందే పంచాంగ శ్రవణ భాగ్యం కలిగించారు.
https://www.facebook.com/yuvasena2222/videos/2480192945327419/
అది మొదలు ఇక అధికార, ప్రతిపక్షాలను ప్రతి సభలోనూ జాతర దరువుతో మోతెక్కిస్తూనే ఉన్నాడు. ఇరు పక్షాల మీడియా సంస్థలూ పవన్ వార్తల్ని రద్దు చేసేశాయి. కేవలం ఆయనపై వచ్చే విమర్శలనూ.. పవన్ పార్టీని డేమేజ్ చేసే అంశాలకు మాత్రమే ప్రాచుర్యం కల్పించేలా తమ విధానాలు మార్చుకున్నాయి. జనసేనను సమర్ధించే వారిపై అసత్య ఆరోపణలూ, పవన్ ను విమర్శించే వారిని సెలబ్రిటీల్లా ప్రొజెక్ట్ చెయ్యడం ప్రారంభించాయి. ప్రతిపక్ష పార్టీకోసం పనిచేసే పత్రికలో సైతం పవన్ కళ్యాణ్ ప్రస్తావన బ్యాన్ చేశారు. దక్షిణాదిన అతి ఎక్కువ వార్షికాదాయం పొందిన వారి లిస్టులో పవన్ టాప్ లో ఉన్నారన్న వార్తలోనే పవన్ ఫొటో వెయ్యలేదు.
ప్రతిపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లడం మాని పాదయాత్రలు చెయ్యడం ఏంటని ప్రశ్నించిన పవన్ అన్ని వర్గాల ప్రజలనూ ఆలోచనలో పడేశారు. సాక్షాత్తూ ప్రతిపక్ష నేత, తృటిలో సీఎం చాన్స్ మిస్ చేసుకున్న జగన్ కూడా నాలుగు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటే ఎంత ఉలికిపాటుకి గురి చేసి ఉంటారో అర్థమవుతుంది. చేసేది లేక వైఎస్సార్సీపీ మద్ధతు దార్లు సోషల్ మీడియాలో గ్రాఫిక్స్ బొమ్మలను క్రియేట్ చేసి స్ప్రెడ్ చేశారు. పార్టీ అనుబంధ మీడియాల్లోనూ, వెబ్ సైట్ లలో జనసేన పార్టీ పొత్తులపై ఊహాగానాలతో దాడి మొదలు పెట్టేశారు. విష ప్రచారాలతో జనసైనికులలో అయోమయం సృష్టిస్తున్నారు.
https://www.facebook.com/PawanKalyanAbhimanulam/videos/403670746866646/
ఇది సంప్రదాయ మీడియాతో ఆగదు. సోషల్ మీడియాలోనూ నిధులు పారించి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇటీవలి సరిహద్దు యుద్ధ వాతావరణం గురించి పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించడం. పవన్ ప్రకటించని అంశాలను కూడా ఆయన పేరుతో ప్రచురిస్తూ జనసేనాని ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. సోషల్ మీడియాలో జనసేనకు సపోర్ట్ చేసే గ్రూప్స్ కొన్ని ఉంటాయి. నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా పవన్ వార్తలు చూపించక పోయినా, ఆ విశేషాలు ప్రజలకు తెలసేలా చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. అయితే అందులోనూ అప్పుడప్పుడూ ఇతర పార్టీలకు చెందిన వాళ్లు తమ పైత్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ‘‘నేను పవన్ వీరాభిమానిని కానీ నా ఓటు మాత్రం జగనన్నకే’’ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరూ పెట్టరు. ఇతర పార్టీలకు చెందిన వారే ముసుగేసుకు ఇలాంటి చిల్లర పనులు చేస్తుంటారు.
పవన్ కళ్యాణ్ ఓటు వేసి గెలిపించదగ్గ నాయకుడు కాదనీ, కేవలం సినిమా నటుడు మాత్రమేననీ దుష్ప్రచారం చెయ్యడానకే అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. దానివల్ల వాళ్లకు ఒరిగేది లేకున్నా రాక్షస ప్రయత్నాలు మానరు. అయినా పవన్ తన ఉద్యమం ఆపరు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న పార్టీల అవినీతిపై యుద్ధం కొనసాగిస్తూనే ఉంటారు. మిగిలిన నాయకుల్లా కేవలం అధికారం చెలాయించాలనే ఉద్దేశంతో కాకుండా ప్రభుత్వ వ్యవస్థల్ని గాడిన పెట్టాలనే ధ్యేయంతోనే పవన్ రాజకీయాలు చేస్తున్నారు. అందుకే ఎన్ని అవరోధాలు ఎదురైనా పాతికేళ్ల భవిష్యత్తు కోసం అంటూ ముందుకుసాగుతున్నారు. రాజకీయాలు చెయ్యాలంటే డబ్బుంటే చాలు.. కానీ బాధ్యతతో కూడిన రాజకీయాలు చెయ్యాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ లాంటి గుండె కూడా ఉండాలి