- అభ్యర్థిత్వం కోసం బయో డేటాల సమర్పణ
- క్యూలోనే వచ్చిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు
విజయవాడ: జనసేన పార్టీ చెప్పిన ఏడు బలమైన సిద్ధాంతాలు విద్యావంతులను అమితంగా ఆలోచింపచేసి పవన్ కల్యాణ్ బాటలో నడిపిస్తున్నాయి. ముస్లింలు, ఇతర మైనారిటీలను మత ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతం ఆకట్టుకుంటోంది. వారిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొస్తోంది. జనసేన అభ్యర్థిత్వాన్ని కోరుతూ పలువురు ముస్లింలు, క్రైస్తవులు బయో డేటాలు ఇస్తున్నారు. గురువారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు 150 బయో డేటాలు వచ్చాయి. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిత్వాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ బయో డేటా సమర్పించారు. జనసేన నేతలు సి.పార్థసారథి, అద్దేపల్లి శ్రీధర్ బయో డేటాలు ఇచ్చారు. అలాగే గుంటూరు నుంచి వైద్యులైన ముస్లిం దంపతులు బయో డేటా ఇచ్చి అభ్యర్థిత్వాన్ని కోరారు. గుంటూరు, కర్నూలు, కడప, నెల్లూ