విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం, అక్కయ్యపాలేంలో జనసేన ఎన్నికల యుద్ధ శంఖారావం సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం:
హైలైట్స్:
గాజువాక 65వ వార్డు లో, 53 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే ఉండటం, తాగునీరు కాలుష్యం సమస్య, గాజువాక చుట్టూ ఇన్ని పరిశ్రమలు ఉండి ఉపాధి అవకాశాల కల్పన లేకపోవటం, విశాఖ డైరీ సమస్యలు అన్నింటినీ జనసేన ప్రభుత్వంతో పరిష్కరిస్తాం – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
పరిశ్రమలు పెట్టేవాల్లొక తరగతికి చెందిన వారైతే దాని వల్ల దెబ్బతింటున్నవాళ్ళింకో తరగతికి చెందిన వాళ్ళు,దీని వల్ల కొన్నిసార్లు సామాజికంగా అసమానతలు ఏర్పడతాయి,ఇదే విషయం నేను గంగవరం పోర్టు యాజమాన్యానికి చెప్పాను, పెట్టుబడులొద్దని చెప్పట్లేదు కానీ ప్రజా సంక్షేమం కూడా ముఖ్యం – జనసేనాని.
నేను ఈ రోజు మీకు మాటిస్తునాను, గంగవరం పోర్టు కాలుష్యం వల్ల దెబ్బ తిన్న ఆఖరి వ్యక్తి వరకు, దిబ్బపాలెం సమస్యలో నష్ట పోయిన చివరి రైతుకు న్యాయం జరిగేవరకు, స్టీల్ ప్లాంట్ వల్ల భూమి కోల్పోయిన ఆఖరి రైతుకి న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా ఉంటాను – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
నేను ఇక్కడినుంచి ఎందుకు నిలబడుతున్నాను అంటే,
విశాఖపట్నం నాకు తల్లి లాంటిది, నాకు అన్నం పెట్టిన తల్లి విశాఖ – గాజువాక లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
దిగువ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాడిని,సమస్యలు తెలిసినవాడిని,అన్నయ్య యాక్టర్ అయ్యాక కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకున్నామేమో గాని లేదంటే మేం కూడా ఇలాంటి సమస్యల మధ్య ఇదే గాజువాకలో ఇదే అక్కిరెడ్డిపాలెంలో ఉండే వాళ్ళమేమో,అందుకే ఈ సమస్యలు తీరేవరకూ మీకు అండగా ఉంటాను – జనసేనాని.
జనసేన ప్రభుత్వం వస్తే, ట్రక్కులు, లారీలు, జేసీబీలు మరియు ఇతర వాహనాల రిపేర్లు కొరకు 500 కోట్లతో 120 ఎకరాల విస్తీర్ణంలో గాజువాకలో ఒక ఆటోమొబైల్ హబ్ నిర్మిస్తాం, దీనితో 20వేల మంది యువతకు ఉపాధి అవకాశాల కల్పనే మా లక్ష్యం – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
నా చిన్నప్పటి నుండీ సమాజంలో సమస్యలు తీరుతాయేమో, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కదా అనుకుంటూ ఉండే వాడిని కానీ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి, స్వచ్ఛమైన తాగునీరు కూడా ఈ రోజున చాలా చోట్ల లభ్యంకాని పరిస్థితి, ఇది మారాలి మనం మారుద్దాం ఈ వ్యవస్థని – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
సినిమాల్లో కంటే రోడ్లు మీదకు వచ్చి ఇలా ఇంత మంది సమస్యల గురించి మాట్లాడటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, వంద గబ్బర్ సింగ్ లు హిట్టు అయినా రాని ఆనందం నాకు ఈ రోజున ప్రజా సమస్యల మీద పోరాడుతుంటే వస్తోంది – గాజువాక లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఒక ప్రభుత్వ గుమస్తాకు ఇచ్చే అంత వేతనాన్ని, డ్వాక్రా గ్రూపుల్లో రిసోర్స్ పర్సన్ కి ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందికి నేరుగా ప్రభుత్వం నుంచి అందజేసేలా,జనసేన ప్రభుత్వంతో శ్రీకారం చుడతాం – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
నేను ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరిస్తాను, సంపదను అందరికీ సమానంగా పంచుతాను. అంతే తప్ప ఈ సాంప్రదాయ రాజకీయ నాయకుల్లాగ ఇష్టానికి సొంత డబ్బు వాడినట్లు వాడను, ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయం – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
మనకు భూమి పెరగదు,ఉన్న భూమిలోనే బ్రతకాలి. తక్కువ స్థలంలోనే బలమైన పటిష్టమైన బహుళ అంతస్తుల గృహ సముదాయాలు నిర్మించి, పిల్లలకోసం ఒక పార్కు, మహిళల కోసం కమ్యూనిటీ హాలు, యువత మానసిక ఉల్లాసానికి క్రీడా మైదానాలు నిర్మించి సామాన్యులకు ఇవ్వటమే జనసేన లక్ష్యం – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
గాజువాక ఒక మినీ ఇండియా, ఇక్కడ అనేక కులాలు మతాలు జాతులకు చెందిన వ్యక్తులు నివసిస్తున్నారు, గాజువాకను ఒక మోడల్ నియోజకవర్గంగా చెయ్యడమే నా లక్ష్యం, ఈ మోడల్ గాజువాకను చూసి దేశంలో మిగతా ప్రాంతాల్లో ఇదేతరహా మోడల్ వాళ్ళు అనుసరించాలి – గాజువాకలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
చంద్రబాబు గారు పక్కన గంట కొట్టి భూ కబ్జాలు చేసే గంటా శ్రీనివాస్ లాంటి వాళ్లు ఉంటారు జగన్ గారు పక్కన క్రిమినల్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ పక్కన జేడీ లక్ష్మీనారాయణ లాంటి నిజాయితీ పరులు ఉంటారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
TDP వాళ్ళు అంటున్నారు వైజాగ్ లో YSRCParty గెలిస్తే భూ కబ్జాలు ఫ్యాక్షన్ సంస్కృతి వస్తుందన్నారు, మరి ఈ ఐదేళ్లలో టీడీపీ చేసింది కూడా అవే భూ కబ్జాలు దందాలు, చివరికి వైజాగ్ లో ఒక ప్రముఖ వైద్యుడి భూమి కూడా కబ్జా చేశారు. మరి వీళ్ళ నుంచి ప్రజల్ని కాపాడేది ఎవరు? జనసేన కాపాడుతుంది – జనసేనాని