జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేశారు. జనసేన ఆవిర్భావ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టో వెల్లడించారు. రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఇస్తామన్నారు.
‘నా ప్రజలు పల్లకిలో కూర్చోవాలి అనుకున్నాను అది తప్పా!’ – @PawanKalyan
జనసేన మేనిఫెస్టో :
* రైతులకు ఎకరానికి రూ.8వేలు సాగు సాయం
* రైతు రక్షణ భరోసా కింద 60ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.5వేలు పెన్షన్
* ప్రభుత్వ నిర్ణయాలతో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం
* పరిశ్రమలకు భూములు ఇచ్చేవారికి అందులో భాగస్వామ్యం
* ప్రతి మండలంలో శీతల కేంద్రాలు
* ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్లు
* ప్రతి జిల్లాలో నదుల అనుసంధానం
* కొత్త రిజర్వాయర్ల నిర్మాణం
* 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య
* డొక్కా సీతమ్మ క్యాంటీన్లు (విద్యార్థులకు ఉచితంగా తిండి)
* కులాలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఫీజు చెల్లింపు
* చిరు వ్యాపారులకు రూ.5వేల రుణ సాయం(పావలా వడ్డీతో)
* ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు
* బీసీలకు 5శాతం రాజకీయ రిజర్వేషన్లు
* కాపులకు రిజర్వేషన్లు
* సామరస్యపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ
* అన్ని కులాలకు కలిపి హాస్టల్స్
* ఆరోగ్య రంగానికి బడ్జెట్ రెండింతలు
* సచార్ కమిటీ సిఫార్సులు అమలు
* విద్యార్థులకు ఉచిత భోజనం, రవాణ సౌకర్యం
* ఏడాదికి 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
* ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా
* ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రులు