ఎంత సేపూ రాజకీయం మీ కుటుంబాలే చెయ్యాలా, సామాన్యులు రాజకీయాల్లోకి రాకూడదా? 22 ఏళ్ల వయసులో సీఏ పూర్తి చేసిన యువకుడిని రాజకీయాల్లోకి తీసుకొస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, కేవలం చంద్రబాబు గారి, జగన్ గారి కుటుంబీకులే కాదు, మేం కొత్త తరాన్ని తీసుకొస్తాం – కైకలూరు లో జనసేనాని
ఈ రోజున రాయలసీమ యువత, ఈ పులివెందుల కుటుంబం కబంధ హస్తాల నుంచి స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది, మార్పును ఖచ్చితంగా తీసుకొస్తాం, సరికొత్త యువరక్తాన్ని తీసుకొస్తున్నాం, దానికి ఉదాహరణే బీవీ రావు గారు, మార్పును సాధించి తీరుతాం – కైకలూరు లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019
టీడీపీ గాని, వైసీపీ గాని ఇలా సామాన్యులకు టిక్కెట్లు ఇవ్వగలరా? మీకు కోట్లు ఆస్తులు ఉండే వ్యక్తులు కావాలి, కానీ జనసేన మాత్రం సామాన్యులతో యువతరంతో మార్పును తీసుకురాబోతోంది – కైకలూరు లో శ్రీ @PawanKalyan గారు #JANASENARevolution2019
2014లో పవన్ కళ్యాణ్ గారు ఇదే కైకలూరు ఎన్నికల ప్రచారం కోసం వస్తే,జనసందోహంలో ఒక చివర జనసేన కార్యకర్తగా, సామాన్య కార్యకర్తగా నిల్చుని ఆయన మాటలు విన్నాను,ఈ రోజున 2019లో ఆయన పక్కన జనసేన అభ్యర్థిగా నిల్చుని మాట్లాడుతున్నాను,ఇది సామాన్యుడి సేన – కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ రావు గారు
చిన్నపాటి తోపుడుబండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న నా అభిమానులు ఇచ్చిన విరాళాలతో నడిపిన పార్టీ జనసేన పార్టీ, అంతే తప్ప ఈ విజయ్ సాయి రెడ్డి గారు చెప్పినట్లు ఎవరో ఇస్తే నడిపించింది కాదు, మీరు మీ పులివెందుల వేషాలు మీ ఇంట్లో వెయ్యండి ఇక్కడ కాదు విజయ్ సాయి రెడ్డి గారు – జనసేనాధిపతి
మీకు పేపర్లు ఉన్నాయి ఛానెల్స్ ఉన్నాయి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీసి కూర్చోపెడతాను మర్చిపోకండి, నాకు మీలా భయాలు లేవు, మార్పు కోసం అన్నీ తెగించి వచ్చేసాను రాజకీయాల్లోకి, ధైర్యవంతుడే మార్పు తీసుకురాగలడు, మీలా సర్దేవాళ్లు ఎప్పటికీ మార్పు తీసుకురాలేరు – జనసేనాధిపతి
నేను మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో కూర్చుని బీ ఫాం లు ఇచ్చాను, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు క్యాంప్ ఆఫీస్ లో కూర్చుని ఇస్తారు బీ ఫాం లు, వైసీపీ అభ్యర్థులను టీఆర్ఎస్ నిర్ణయిస్తుంది, కేసీఆర్ గారు చెప్పిన వాళ్ళకే వైసీపీ బీ ఫాం లు ఇస్తుంది – కైకలూరు లో శ్రీ @PawanKalyan గారు
Grand welcome for JanaSena Chief @PawanKalyan in Kaikaluru. pic.twitter.com/S5SJEQIRM2
— JanaSena Party (@JanaSenaParty) March 24, 2019