భారత గగనతలంలోకి చొరబడ్డ పాక్ యుద్ధ విమానాలు:
సరిహద్దుల్లో భారత బలగాలను కవ్విస్తున్న పాక్, భారత గగనతలంలోకి తన యుద్ధ విమానాలతో ప్రవేశించింది.నియంత్రణరేఖ దాటి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు.
నిన్నటి వైమానిక దాడులతో తీవ్ర అసహనంతో వున్నా పాకిస్థాన్ దుస్సాహసం చేసింది. పాకిస్థాన్ యుద్ధ విమానాలు మన గగనతలం లోకి ప్రవేశించాయి.పాకిస్థాన్ కు చెందిన F-16 యుద్ధ విమానాలు నియంత్రణరేఖ దాటి నౌషెర,రజొరీ సెక్టార్ లోకి చొరబడ్డాయి.
పాక్ గగనతల ఉల్లంఘనను పసిగట్టిన భారత వైమానిక దళం పాక్ జెట్ ఫైటర్స్ కి కౌంటర్ ఇచ్చాయి.దీంతో పాక్ యుద్ధ విమానాలు పలు చోట్ల బాంబులు విసిరాయి.
అయితే భారత యుద్ధ విమానాలు ఇచ్చిన గట్టి స్పందనను చుసిన పాకిస్థాన్ యుద్ధ విమానాలు తోక ముడిచి సొంత ప్రాంతానికి వెళ్లిపోయాయి.
ఉద్రిక్తత నేపథ్యంలో శ్రీనగర్, జమ్మూ,పఠాన్కోట్ నుంచి విమాన సర్వీసులను భరత్ నిలిపి వేసింది.పాక్ సరిహద్దు మొత్తం హై అలెర్ట్ ప్రకటించింది.