చరిత్రలో ఈరోజు(March 14) కి వున్న విశిష్టిత:
1.చరిత్రలో ఈరోజు అంతర్జాతీయ పై డే గా జరుపుకుంటారు.గణితశాస్త్ర స్థిరాంకం యొక్క మొదటి మూడు అంకెలు 3.14 కావున ఈరోజు పైడే గా జరుపుకుంటారు.
2.1888 సంవత్సరం లో ఇదే రోజున అంటే మార్చి14 న అత్యధిక సర్క్యూలేషన్ గల మలయాళ వార్తా పత్రిక మలయాళ మనోరమను ఖన్ధాతిల్ వర్గీస్ మాప్పిళ్ళై స్థాపించారు.
3.1931లో ఇదే రోజున భారత దేశంలో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబై లోని గోరేగావ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటర్ లో విడుదలయింది.
4.2008 లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీచే ప్రారంభోత్సవం జరిగింది.
5.1879 లో ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త , నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐంస్టీన్ జననం.
6.1883 లో ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ- ఆర్థిక వేత్త, విప్లవకారుడు కార్ల్ మర్క్స్ మరణించారు.
7.1917 లో స్వర బ్రహ్మ గ పేరొందిన ప్రఖ్యాత స్వరకర్త కే.వి. మహదేవన్ జన్మించారు.
8.1930లో ప్రముఖ తెలుగు రచయిత్రి నాయని కృష్ణ కుమారి జననం(March14).
9.2013 లో రంగస్థల నటుడు, రూపశిల్పి అడబాల మరణం.
10.1664 లో సిక్కుల 8వ గురువు గురు హరికిషన్ ఢిల్లీ లో మరణించారు.