పవన్ కళ్యాణ్ను ఎందుకు బలపరచాలి ?

pawan

*పవన్ కళ్యాణ్ను ఎందుకు బలపరచాలి ?*

*1. రాజ్యాంగంలోని కులాతీత సోదరభావం తన సిద్ధాంతమన్నాడు.*

*2. రాజ్యాంగంలోని మతసామరస్యానికి పునాదైన లౌకికవాదం తన సిద్ధాంతమన్నాడు.*

*3. మహిళా స్వేచ్ఛకు సాధికారత తన సిద్ధాంతమన్నాడు.*

*4. వారసత్వాలకు, కులాధిపత్యాలకు అతీతమైన ప్రజాస్వామ్యం తన సిద్ధాంతమన్నాడు.*

*5. సామజిక సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలే కాక, సామాజిక పరిష్కారం కూడా అవసరమన్నాడు.*

*6. పర్యావరణ పరిరక్షణ తన సిద్ధాంతమన్నాడు.*

*7. పేదకుటుంబంలో అమ్మ చేతిలో ఆర్ధిక పెత్తనం. ఇది తన ‘క్యాష్ ఫర్ రేషన్’ పధకం లక్ష్యం.*

*8. సమసమాజ స్థాపనకు విద్యావ్యవస్థ పునాదికావాలి. ఇది తన ‘కామన్ స్కూల్ సిస్టమ్’ లక్ష్యం.*

*9. బడుగు బలహీన వర్గాల పిల్లలలోని శాస్త్ర, సాంకేతిక ప్రతిభలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలి. ఇది తాను ప్రతిపాదిస్తున్న విద్యావిధాన లక్ష్యం.*

*10. రైతులకు వ్యవసాయంతో స్వావలంబన దర్జా రావాలి. ఇది తన వ్యవసాయ విధానం.*

*11. లక్షలాది చిరు వ్యాపారులకు దోపిడీ పీడన నుండి రక్షణ కావాలన్నాడు.*

*12. సామాన్యుడికి న్యాయం జరగాలంటే అవినీతి లేని పారదర్శక పాలన కావాలన్నాడు .*

*13. సుపరిపాలనకు ప్రజాప్రతినిధికి స్పందించే మనసు, పోరాడే తత్త్వం ఉండాలన్నాడు.*

*15. విద్య, వైద్యం వ్యాపారం కాదు, ప్రభుత్వ బాధ్యత అన్నాడు.*

*16. జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యత అతి కీలకంగాను, బహుజన రంజకం గాను వుంది.*

*17. బహుజనుల తోబుట్టువు, దళితుల గౌరవ ప్రతీక, ప్రపంచం గుర్తించిన ప్రభావశీల మహిళ బెహన్జీ మాయావతి.*

*18. ఆవిడ నిజంగానే సర్వజన హితకారిని, సర్వజన సుఖదాయిని. ప్రతిభా సామర్ధ్యం, అనుభవ పూర్వక పాలనా దక్షతగల రాజనీతిజ్ఞురాలు.*

Janasena

*19. తాను దేశనికి ప్రధాని అయితే:*

*A. మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తవుతుంది.*

*B. చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతాయి.*

*C. OBC, SC, ST, మహిళలకు వున్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్ వస్తుంది. EBC లకు తగిన రీతిలో న్యాయం జరుగుతుంది.*

*D. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ వస్తుంది. దేశంలోని వివిధ రిజర్వేషన్ ఉద్యమాలకు పరిష్కారం దొరుకుతుంది.*

*E. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఎన్నికల విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి.*

*F. SC, ST, మహిళలకు గల ప్రత్యేక చట్టాలు అమలవుతాయి.*

*G. అంభేద్కరు ఆశించిన రీతిలో రాజ్యాంగం పూర్తిగా అమలవుతుంది.*

*H. ఎన్నో ఆర్ధిక సంస్కరణల ద్వారా ఆవిడ అసమానతలను తగ్గిస్తుంది.*

*I. దేశంలో మహిళలకు, మైనారిటీలకు, దళితులకు తగిన న్యాయం జరుగుతుంది.*

*J. ఇలా అందరికీ సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం బెహన్జీ నాయకత్వంతోనే సాధ్యమవుతుంది.*

*K. ఇలా ఎన్నో మార్పులకు మాయావతి – పవన్కళ్యాణ్ల పొత్తు దోహద పడుతుంది.*

https://www.facebook.com/janasenapartyapnews/videos/417858908992004/

*L. ఈ సామాజిక విప్లవకారిణిని తెలుగు రాష్ట్రాల్లో తెరమరుగు చెయ్యాలని, కనుమరుగు చెయ్యాలని, వినుమరుగు చెయ్యాలని కుట్రలు పన్నుతున్న TDP, YSRCP, TRS లకు భిన్నంగా ఆవిడను దేశ రాజకీయాలకే కేంద్రబిందువును చేసారు పవన్కళ్యాణ్! ఇది తనలోని సామజిక న్యాయ సిద్ధాంతానికి తార్కాణం.*
———-
*- BSPని దళితుల పార్టీ అని ముద్రవేసి బహుజనుల రాజకీయ అధికారాన్ని జాతీయ స్థాయిలో దెబ్బ తీశారు. అంభేద్కర్ సిద్ధాంతాన్ని చంపాలని, మాయావతి నాయకత్వంపైన, వ్యక్తిత్వంపైనా కావాలని బురద చల్లుతున్నారు. ఆవిడ పాలనా సంస్కరణలను దాచేస్తున్నారు.*

*- ఆంధ్ర రాష్ట్రంలో 2009లో PRPని కాపుల పార్టీ అని ముద్రవేసి బహుజన ప్రత్యామ్నాయాన్ని కూల్చేశారు.*

*- ఇప్పుడు BSP- JSPల పొత్తును TDP కుట్ర అని ప్రచారం చేసి రాష్ట్రంలోను, దేశంలోను బహుజన ఉద్యమాన్ని మరోసారి నీరుగార్చాలనే కుట్ర చేస్తున్నారు . ఆధిపత్య వర్గాల పుకారు రాజకీయాల నుండి బహుజనులు, ప్రత్యేకించి దళితులూ జాగ్రత్త పడాలి! నాలాంటి వ్యక్తులను మీరు గడ్డిపరకలా తీసేయవచ్చు. నష్టంలేదు. కానీ, మనందరికీ ఆలంబన అయిన అంబెడ్కర్ వాదాన్ని చంపుకుంటే మన భవిష్యత్ తరాలకు బానిసత్వమే మిగులుతుంది.*

By unswamy

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *