2019 సార్వత్రిక ఎన్నికల బరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడో ప్రత్యామ్నాయంగా దూసుకుపోతున్న జనసేన పార్టీపై కుటిల పన్నాగాలకి పదును పెట్టారు ప్రత్యర్ధులు.. మొన్నటి వరకు టీడీపీతో కలిసి వెళ్తుందని వైసీపీ., కాదు వైసీపీ-బీజేపీలతో కలసి వెళ్తుందని టీడీపీ తప్పుడు ఆరోపణలతో పార్టీ శ్రేణులను, ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేశాయి.. పవన్ పదే పదే చెబుతూ వచ్చినా., ఎప్పటికప్పుడు కొత్త రాతలతో పచ్చ., ప్రతిపచ్చ మీడియాలు జనసేన లక్ష్యంగా వార్తలు రాస్తూ వచ్చాయి.. ప్రమాదకరమైన ప్రత్యర్ధిగా ఎదుగుతున్న జనసేన పార్టీని జనానికి దూరం చేయడమే ఈ వరుస కథనాల వెనుక లక్ష్యం.. ఎన్నికలు దగ్గర పడిన కొలదీ జనసేన అధినేత ముందు నుంచి ఏదైతే చెబుతూ వచ్చారో., వామపక్షాలతో మినహా ఎవరితో పొత్తులు పెట్టుకునేది లేదని అదే నిజం అన్న విషయం జనం గ్రహించడం మొదలుపెట్టారు.. ఇన్నాళ్లు ప్రత్యర్ధి పార్టీలు చేస్తూ వచ్చిన ఆరోపణలు పచ్చి అబద్దం అన్న సంగతి ప్రజలు గ్రహించేశారు..
ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ., జనసేన పార్టీని టార్గెట్ చేసేందుకు మరిన్ని కుటిలయత్నాలతో ప్రత్యర్ధులు రంగంలోకి దిగారు.. పార్టీ అఫీషియల్‌గా సీట్లు ప్రకటించకుండానే ఆ స్థానం నుంచి వీరు ఎంపికయ్యారు., ఈ స్థానం నుంచి వారు ఎంపికయ్యారు అంటూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తూ., తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఇప్పటి వరకు జనసేన పార్టీ కేవలం ఇద్దరు పార్లమెంట్ అభ్యర్ధులతో కూడిన జాబితాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే మీడియాలో మాత్రం అసెంబ్లీ టిక్కెట్లు కూడా అనౌన్స్ అయిపోయినట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటే ఊకదంపుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు..