సామాన్యుల మధ్య అతిసామాన్యుడిలా పవన్ కళ్యాణ్
ఉత్తరాంధ్ర బస్సు యాత్ర కోసం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ భవన్ లో ఒక సామాన్య వ్యక్తిలా సాధారణ జీవనం సాగిస్తున్నారు.
మీడియా ఇంఛార్జ్ పి.హరిప్రసాద్ గారు మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సాధారణమైన జీవితాన్నే గడుపుతారు. ఆయన ఎప్పుడూ ఏ.సీ ఉపయోగించరు. నేల మీద నిద్రపోవడమే ఆయనకు అమితమైన ఇష్టం. యోగ, మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు ఆయన కటిక నేల మీద పడుకునేవారు, కనీసo చాప కూడా వేసుకునేవారు కాదు. అదే తనలో జీర్ణించుకు పోయింది. ఆయన దగ్గర వేల స్థాయిలో పుస్తకాలు ఉంటాయి, ఎక్కడికి వచ్చిన వాటిని తనతో పాటు తీసుకొస్తారు. పుస్తకాలు చదువుతూనే ఎక్కువ కాలక్షేపం చేస్తారు. రాత్రి 9 లేదా 10 గంటలకు నిద్రిస్తారు.ఉదయాన్నే 4 గంటలకు లేచి యోగ చేసిన తరువాత పార్టీకి సంబంధించిన విషయాలపై ఆలోచన జరుపుతుంటారు. ఈ మూడు రోజులు ఆయన ఇక్కడే ఉంటారు. ఇక్కడికి వచ్చిన ఆయన శ్రేయోభిలాషలు, మిత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ.సీ గాని కూలర్ గాని పెట్టుకోండి విశాఖపట్నం చాల వేడిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆయనని కోరారు. నేను ఎప్పుడూ ఏ.సీ వాడను ఇప్పుడు కూడా వాడను అని అన్నారు. ఇక్కడ జనసేన కార్యకర్తలు ఒక మంచం ఏర్పాటు చేసారు, అయినా సరే ఒక చాపని తెప్పించుకొని దానిపైనే నిద్రిస్తున్నారు. ఈ ఉత్తరాంధ్ర టూర్ దాదాపు 45 రోజులు కొనసాగుతుంది. ఆయన జీవన విధానం ఇలానే ఉంటుంది. చిన్న చిన్న సత్రాలు, కళ్యాణమండపాలులో బస చేస్తారు. ఆయనతో వచ్చిన పార్టీ నేతలు, ముఖ్యమైన వ్యక్తులు అందరూ ఇక్కడే బస చేస్తారు, ఇదే విధంగా జీవనం కొనసాగిస్తారు.