ఈరోజు #మంగళగిరిలోని-హాయ్‌ల్యాండ్‌లో జనసేన #వీరమహిళా విభాగం అధ్వర్యంలో నిర్వహించిన
#అంతర్జాతీయ–#మహిళా దినోత్సవ కార్యక్రమంలో #పవన్‌కళ్యాణ్ గారు–>ప్రతి #రైతుకుటుంబానికి ఎకరాకు రూ.8 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తాం..ఈ మాటని నిలబెట్టుకుని తీరుతాను…
మహిళా దినోత్సవాన రైతు కుటుంబాలకి చెందిన ఆడపడుచుల ఆవేదనని అర్ధం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు..ఈ రెండు అంశాలనీ పార్టీ మేనిఫెస్టోలో చేర్చనున్నట్టు స్పష్టం చేశారు…
#మార్చి 14న ఆవిర్భావ దినోత్సవం నాడు మేనిఫెస్టో ప్రకటించాలని భావించాను…రైతుల కుటుంబాన్ని నడిపే మహిళలు నన్ను ఆలోచింప చేయడం వల్ల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే ప్రకటించాను..రెండు లక్షల కోట్ల బడ్జెట్‌కి నోటికి వచ్చిన చందంగా ఐదు లక్షల కోట్ల హామీలు ఇచ్చి మోసం చేయడం ఇష్టం లేకనే ప్రతి అంశంలో ఆచితూచి అడుగులు వేస్తున్నా…
అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న హామీలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది..నేను మాత్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని తీరుతా…రైతుల కష్టాలు చూస్తుంటే ఆవేదన కలిగిస్తుంది..అన్నం పెట్టే రైతులు దేవతలతో సమానం. రైతు క్షేమంగా ఉంటేనే రామరాజ్యం వస్తుంది…రైతుల క్షేమం కోరుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రైతు కుటుంబాల్లో ఆడపడుచుల భద్రత కూడా దాగి ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలు చూసిన తరవాత రైతులకి, రైతు కూలీలకి ఉపయోగపడే విధంగా దీన్ని మలచాలని నిర్ణయించాం. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం…
👉#హాస్టల్స్ లో విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం..
https://www.facebook.com/Pawanfansekkada/videos/2082516255136208/
విద్యార్ధినులు ఎంతో బలమైన సంకల్పంతో కూడిన వ్యక్తిత్వంతో ముందుకి వస్తున్నారు. వారందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆడపడుచుల మానప్రాణ సంరక్షణ బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుంది. ఓ మహిళకి మానభంగం జరిగితే అక్కడ కూడా కులం ట్యాగ్ తీసుకువచ్చే పరిస్థితులు నేటి సమాజంలో ఉన్నాయి.
అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఆడపడుచులకి చట్ట సభల్లో స్థానం కల్పించాలి. అలాంటి మార్పుకి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది. స్కూల్స్‌లో టాయిలెట్స్ లేక చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రతి స్కూల్లో టాయిలెట్స్‌తో పాటు బాలికల హాస్టల్స్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం. హాస్టల్స్ చుట్టూ బలమైన గోడలు నిర్మించి భద్రత కల్పిస్తాం. అవసరమైన రూట్లలో మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తాం. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళా గైనకాలజిస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటాం…
అడపడుచులకు, అక్కచెల్లెళ్లకు అంతర్జాతీయం మహిళా దినోత్సవం సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా దృష్టిలో మహిళల్ని గౌరవించడానికి ఒక్కరోజు సరిపోదు. ఉమెన్స్ డే, మదర్స్ డే అంటూ ఒక్క రోజుకే అది పరిమితం కారాదు. నేను నా తల్లిని నిత్యం గౌరవిస్తా. మహిళా దినోత్సవాలను లక్ష్యం దిశగా చేయాలి. తూతూ మంత్రంగా నిర్వహించడం కాదు…
ఏడాది పొడవునా మహిళా సాధికారిత, వారి మానప్రాణ రక్షణ దిశగా ముందుకి వెళ్తామని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నేను రాజకీయాల్లోకి రావడం వెనుక వున్న బలమైన కారణాల్లో ఒకటి ఆడపడుచులపై జరుగుతున్న ఆకృత్యాలు. షూటింగులకి వచ్చే అమ్మాయిల పట్ల ఆకతాయి ప్రవర్తనలు గానీ, పసిబిడ్డలపై జరుగుతున్న ఆకృత్యాల వంటివి నన్ను ఆలోచింప చేశాయి. ఆడపడుచులు బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా వచ్చే రోజులు రావాలని కోరుకుంటున్నా…
ఆడపడుచులకి భద్రత లేనప్పుడు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ వుంటే ఉపయోగం ఏంటి.? గాంధీ మహాత్ముడు కోరుకున్నట్టు అర్ధరాత్రి సంగతి పక్కనపెడితే, కనీసం పట్టపగలు వీరంతా క్షేమంగా తిరిగేలా ఉండాలని కోరుకునే స్థాయికి పరిస్థితులు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ఓ ఎన్జీవో స్థాపిస్తే సరిపోదు. బలమైన చట్టాలు తీసుకురావాలి. అది రాజకీయాలతోనే సాధ్యం. ఇలాంటి బలమైన కారణాలే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి…
👉#పార్టీ పదవుల్లో 33శాతం ఆడపడుచులకే..
చదువుల కోసం బయటికి వెళ్లే ఆడబిడ్డలు ధైర్యంగా ఇంటికి తిరిగి రావాలి. ఒక్కో ఆడపడుచు వంద మంది పురుషులకి సమాధానం చెప్పే స్థాయిలో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతోనే మహిళా విభాగానికి వీర మహిళా విభాగంగా నామకరణం చేయడం జరిగింది. పార్టీకి సంబంధించి కమిటీలు వేసే సమయంలోనూ మరే పార్టీ ఇవ్వని విధంగా మహిళలకి తొలి ప్రాధాన్యం ఇచ్చాను…
ఆడపడుచుల దీవెనలతో మొదలుపెట్టాను. పార్టీ నిర్మాణంలో మండల స్థాయి వరకు 33 శాతం ఆడపడుచులకి అవకాశం ఇస్తాం. పని చేయగలిగే వారు, నిబద్దతతో నిలబడగలిగే ఆడపడుచుల కోసం చూస్తున్నాను. అలాంటి వారు ముందుకి వచ్చిన నాడు పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలకి చోటు కల్పిస్తాం. చట్టసభల్లో మహిళలకి 33 శాతం రిజర్వేషన్లు అందించడానికి సిద్ధంగా ఉన్నాను…
అయితే ప్రత్యర్ధుల వ్యూహాల ఆధారంగా దాని అమలు సాధ్యపడుతుంది. పార్టీ పదవుల్లో మాత్రం ఖచ్చితంగా మూడో వంతు రిజర్వేషన్ అమలు చేస్తాను. పార్టీ పదవులు ఎవ్వరికీ అలంకారం కారాదు. బాధ్యత అవ్వాలి. బాధ్యతగా పనిచేసే అలాంటి ఆడపడుచుల కోసం ఎదురుచూస్తున్నాను. పదవులు ఇచ్చే విషయంలో ఏమైనా తప్పొప్పులు ఉంటే నా దృష్టికి తీసుకురండి. చేసిన పనికి తగ్గ పదవులు దక్కకపోతే నాకు తెలపండి. దాన్ని సరిదిద్దుతాం…
సోషల్ మీడియాలో తిట్టుకోవద్దు. వ్యక్తిగత గుర్తింపు కోరుకుంటే ఎదుగుదల అసాధ్యం, వ్యవస్థని నిర్మిస్తేనే అంతా ఎదగగలుగుతాం. 2019 ఎన్నికలు చాలా కీలకం. వ్యవస్థ నిర్మాణానికి అంతా మనస్ఫూర్తిగా సహకరించాలి. చిన్నపాటి ఆటుపోట్లు ఉన్నా పట్టించుకోకుండా ముందుకి వెళ్దాం. జనసేన పార్టీలో గుర్తింపు ఆలస్యం అవ్వవచ్చు గానీ, గుర్తింపు రాకపోవడం అంటూ ఉండదు. సహనంతో అర్థం చేసుకుని మీరంతా దీవిస్తే విజయకేతనం ఎగురవేయడం ఖాయం..మీరు అండగా ఉంటేగాని ముందుకి వెళ్లలేం..మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను…