ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం సామాన్యుడిలా ఉండాలనుకున్నా, అందరి హీరోల్లా ఉండాలనుకోలేదు. మొదటి నుంచి జనసేన గళం ఒకటే, ఇచ్చిన హామీల అమలు. ఉద్యమాలకు ఊపిరి పోసిన, అన్యాయానికి ఎదురు నిలచిన జిల్లా శ్రీకాకుళం జిల్లా.
నర్సన్నపేటలో జనసేనాని ప్రసంగం:
* ఇంతమంది యువత ఉన్న శ్రీకాకుళం జిల్లాకి సరైన అభివృద్ధి లేదు, సరైన పరిశ్రమలు లేవు.
ఈరోజు మీముందుకు రావటానికి కారణం ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం
* టీడీపీ ఎలా ఉందంటే ఉమ్మడిగా తిని ఒంటరిగా బలవాలి అన్నట్టుగా ఉంది, ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందాలి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారుహెరిటేజ్ కంపెనీ మాజీ ఉద్యోగులకు ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం
* మన మత్స్యకారులకి, వెనుకబడిన వారికి అండగా ఉండటానికి వచ్చింది జనసేన పార్టీ
* శ్రీకాకుళం జిల్లాకి చాలా చేసాం అని చెపుతున్న ముఖ్యమంత్రి గారు కనీసం సరైన త్రాగునీరు, సాగునీరు కల్పించారా
* శ్రీకాకుళం చాలా గొప్ప జిల్లా, భరతమాత ఉన్న నేల, భౌద్ధరామం ఉన్న నెల, అరసవెల్లి సూర్య భగవానుడు నెలవైన నేల
* మాటల్లేవ్ చేతలే, మాటలు వద్దు మార్పే, మాటలు విని విని అలసిపోయాం
* నేను వారసత్వరాజకీయలకు వ్యతిరేకం, ఒక కుటుంబం చేతుల్లో అధికారం ఉంటే అభివృద్ధి జరగట్లేదు
* ఒక సాటి మనిషి కష్టాలు పడుతున్నప్పుడు, కన్నీళ్లు పెడుతున్నప్పుడు, ఎన్ని వేల కోట్ల డబ్బుంటే ఏమ్? ఎంత మంది చప్పట్లు కొడితే ఏమ్? .ఒక సాటి మనిషి బాధలకి కన్నీరు కార్చలేని అధికారం ఎందుకు? ఆ బ్రతుకెందుకు.
* ప్రజాస్వామ్యం సాక్షిగా ఓటేసి గెలిపించే ప్రజలకి పాలకులు ఇచ్చే బహుమానాలు వారి అనారోగ్య చావులే ఐతే, నీరుగారి చనిపోతున్న ఆ నిస్సహాయుల ఆశల్ని బ్రతికించడానికి వచ్చిన మన జనసేనాని పోరాటమే వారికి సమాధానం అవుతుంది