నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు ఉన్న డబ్బుని వదులుకొని సేవ చేద్దాం అని రాజకీయాలోకి వచ్చా.
పదవి ఆశించేవాడిని అయితే, నేనొక ఎంపీ అవ్వాలి అనుకున్న యమ్. ల్. ఏ అవ్వాలి అనుకున్న 2009 లోనే అవ్వేవాడిని, నేనెప్పుడూ నాకంటే అనుభవం ఉన్నవారికి గౌరవం ఇస్తాను.2014 ఎన్నికల సమయం లో కుడా చంద్రబాబు గారి అనుభవం చాల అవసరం కొత్త రాష్టానికి అని నమ్మాను.
జనసేనని విమర్శించడం చాలా ఈజీ టీడీపీ పార్టీ కి ఇతర పార్టీ కి.చంద్రబాబు గారు కూడా పార్టీ ని స్థాపించలేదు, యాన్ టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన స్థాపించిన పార్టీ లో ప్రధాన కార్యదర్శిగా చేరి అప్పుడు దాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు
రాజకీయంగా మనం తెలంగాణలోనే మొదలుపెట్టినా, పోటీ చెయ్యడానికి రాజకీయ ప్రస్థానం శ్రీకాకుళం లోనే మొదలయింది.
రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రి అయ్యిపోవాలి అని నేను కోరుకోలేదు. నేర్చుకుంటాను, శ్రమిస్తాను, సాటి మనిషి సమస్యలను అర్థం చేసుకుంటాను, అంతే గాని నన్ను ముఖ్యమంత్రి చెయ్యండి మీ కష్టాలు తీరుస్తా అనే వ్యక్తిత్వం కాదు నాది.
నేను గెలుస్తానా, ఓడిపోతానా అనేది నాకు తెలియదు గాని నేను మాత్రం మోసం చెయ్యను మిమ్మలిని.