కొండారెడ్డి బురుజు నుండి చెప్తున్నా జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవు – – కర్నూలు బహిరంగ సభలో శ్రీ @PawanKalyan
దోపిడీ దారులు వచ్చినా ఎదురుకొనే బురుజు ఈ కొండారెడ్డి బురుజు. ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది.
అంగబలం, అర్థబలం సామాన్యుడిని నలిపేసేందుకు ఉపయోగిస్తుంటే, మరి మీరు కోరుకున్నట్లు సీఎం అయితే ఆ పరిస్థితులను మార్చుతాను.
మీరు వేసే కేకలు మార్పుకి చిహ్నం.రౌడీ రాజకీయాన్ని తరిమేద్దాం. యువత మార్పు కోరుకుంటుంది.
భగవంతుడు ఇంత అభిమాన బలం ఇచ్చాడు, ఇంత అఖండ స్వాగతం ఇచ్చిన కర్నూలుకి ధన్యవాదాలు.
ఎక్కడికి వెళ్లినా, ఇందాక ఇక్కడికి వస్తున్నా నన్ను చూసి గుండెలు బాదుకుంటున్నారు అంటే దానికి కారణం ప్రజలు విసిగిపోయారు, ఈ కుటుంబ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు, ఆ స్వేచ్ఛ ఈరోజు మీరు సీఎం సీఎం అని అరిచేలా చేస్తుంది.
రెడ్డి అంటే ప్రజలను కాపాడేవాడు, దోచుకునే వాడు కాదు.
మనకి సంబంధించిన వాడే ముఖ్యమంత్రి, మంత్రి అంటే మార్పు రాదు. కులాలను కలుపుకొని రాజకీయం చెయ్యాలి, అది జనసేన చేస్తాది.
రౌడీయిజం, గుండాయిజంతో యువత విసిగిపోయారు.యువతకి ఉద్యోగాలు కావాలి.
మీకు పెద్ద నాయకులు లేరు, పెద్ద వ్యక్తులు లేరు, డబ్బులు లేవు అని అందరూ అంటున్నారు. జనసేన పార్టీ మీలాంటి సమాన్యులతో మార్పు తెప్పిస్తాది.
అన్యాయనికి ఎదురు నిలబడే జిల్లా కర్నూలు జిల్లా.ఇక్కడ కొత్తరాజకీయాన్ని తీసుకొస్తా నేను.
ఎంతసేపు మనకు సంబందించిన వాడు, మన కులం వాడు ముఖ్యమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుంది అనే విధానం పోవాలి, ఎవరు వచ్చినా అందరికి న్యాయం జరగాలి, అందుకే కులాలను విడదీయటం కాకుండా కులాలను కలిపే ఆలోచనా విధానంతో ముందుకు వెళ్తున్నాను.
కాటమ రాయుడు అంటే రాయలసీమకు సంబందించిన గొర్రెల కాపరి, ఆరోజు నెల్లూరు రాజులు అన్యాయంగా అతడిని శిక్షించాలని చూస్తే వారికి ఎదురుతిరిగిన కాటమ రాయుడు పుట్టింది మన కర్నూలు జిల్లాలో.
నేను వీరమహిళ విభాగానికి కర్నూల్ జిల్లాకు చెందిన రేఖ గారిని అధ్యక్షురాలుగా చేయడానికి కారణం ఆమెకు పోరాడగల శక్తి ఉంది, రాజకీయాల్లోకి కొత్తరక్తాన్ని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నమే జనసేన.
మార్పు రావాలి అంటే నాకు ఈ జేజేలు అక్కర్లేదు, ఇక్కడ 18 ఏళ్ళు నిండినవారు జనసేనకి ఓటు వేయండి.
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గడగడలాడించాడు, మరి అవినీతితో నిండిపోయిన ఈ వ్యవస్థలో మీలాంటి యువతతో కలిసి మార్పు సాధిస్తాను.
మనకి భయాలు లేవు, ఓటమికి బయపడేవాడికి గెలుపు రాదు, ఓటమికి బయపడని వాడికే గెలుపోస్తుంది, వారికే విజయం తధ్యం.
6 గురు ఎమ్మెల్యేలు, ఎంపీలను తీసుకొని ఓట్లు వేయించుకుందాం అంటే మార్పు రాదు, ఎవరో ఒకరు మార్పు కోసం పోరాటం మొదలుపెట్టాలి, నాకు భయం లేదు, మీరిచ్చిన ధైర్యం ఉంది.
ఇక్కడకు వస్తుంటే చాలా మంది ఆ కులాలకు హామీలు ఇవ్వు, ముస్లింలను ఆకట్టుకో అని చెప్పారు, అసలు ఇక్కడ ఇచ్చేది ఎవరు, తీసుకునేది ఎవరు, ఇది మనందరి సొమ్ము, మనందరి హక్కు, ఇక్కడ ఇచ్చేవాడు ఎవడు లేడు, సమానంగా పంచగలిగేవాడు కావాలి.
నేను సమానంగా అందరికి అభివృద్ధి పంచడానికి వచ్చాను.
ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం, మన ముస్లింలు మైనార్టీలు అని ఎందుకు చెప్పుకోవాలి, ముస్లింలు ప్రత్యేకంగా దేశభక్తి చూపించాలా? వారు భారతీయులని నిరూపించుకోవాలా.
అక్కడ పాకిస్థాన్ వాడు దాడి చేస్తే ఇక్కడ ముస్లింలు దేశభక్తి నిరూపించుకోవాలా? హిందువులకు మాత్రమే దేశభక్తి ఉందా, దేశం కోసం చనిపోయిన ముస్లింలు లేరా? మానవత్వం నిరూపించుకున్న ముస్లింలు ఉన్నారు మన దేశంలో.
నా జనసైనికులే నా పేపర్లు, నా చానెళ్లు, నేను మిమ్మల్ని నమ్మి వచ్చాను తప్ప ఏవో ఛానళ్లను కాదు.
రాయలసీమకి ఉద్యోగాలు తీసుకొచ్చే దమ్ము, ధైర్యం, సత్తా జనసేనకి ఉంది.
మన బడ్జెట్ లక్ష, లక్షన్నర కోట్లయితే, ఈ ప్రభుత్వం, ప్రతిపక్షాలు 4 లక్షల కోట్ల పధకాలు చెప్తారు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు, ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తారా.
నేను అధికార, ప్రతిపక్షాల్లాగా అబద్దాలు చెప్పను, వారి విధానాలు చూసి అసహ్యమేసింది, వారిలాగా నేను మిమ్మల్ని మోసం చేయను.
సీఎం,సీఎం అనే నినాదాలతో మారుమోగుతుంది కర్నూలు గడ్డ. #JanaSenaPorataYatra pic.twitter.com/CmGICzhn14
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 24, 2019
నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను, వచ్చే పాతిక సంవత్సరాలు నేను మీతో ఉంటాను, మీతో పాటుగా నడుస్తాను, నేను వచ్చి 5 ఏళ్ళయింది, ఏమి ఆశించకుండా రాజకీయాలు చేసాను, మీరున్నారు అనే నమ్మకంతో మార్పు తీసుకురావడానికి వచ్చాను.
కొండారెడ్డి బురుజు సాక్షిగా చెబుతున్నాను, జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద ఆన వేసి చెబుతున్నాను ఎవ్వరు ఏం చేయాలని చూసినా సరే మార్పు సాధించి తీరుతాం.
ఒక వ్యక్తికి పాలన అవకాశం ఇస్తే రాష్ట్రం అస్తవ్యస్తం చేశారు, రాబోయే రోజుల్లో అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయి, అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిందే.
నేను మహిళల అకౌంట్లో నగదు వేస్తా అని చెప్పినా, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా అని హామీ ఇచ్చినా అవన్నీ బడ్జెట్ కి లోబడి అధికారులతో సంప్రదింపులు జరిపి చేయగలను అని నమ్మకం వచ్చాకే ఇచ్చాను.
సీపీఎస్ గురించి ఇతర పార్టీలు ఎలా పనిచేస్తాయో తెలియదు కాని జనసేన ఖచ్చితంగా రద్దు చేసేందుకు పోరాడతాను అని హామీ ఇస్తున్నాను.
చంద్రబాబు, జగన్ మ్యానిఫెస్టోలో చెప్పినవి చేస్తాం అని చెప్తారు కానీ వారు చెయ్యలేరు. ఇక్కడ ఉన్నా వారందరికీ నేను చెప్తున్నాను, మాట ఇస్తున్నాను, 25 సంవత్సరాలు మీకోసం వచ్చాను ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను.
కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జన సముద్రం.#JanaSenaPorataYatra pic.twitter.com/NdSKrGNSzL
— JanaSena Shatagni (@JSPShatagniTeam) February 24, 2019
నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, కష్టపడుతున్నాను, నా దగ్గర వేల కోట్లు లేవు, న్యూస్ పేపర్స్ లేవు.
తుంగభద్ర నది మొత్తం కలుషితమైంది, పెద్ద పెద్ద వ్యక్తుల పరిశ్రమల సంస్థల వ్యర్ధాలు అందులో కలిపేస్తున్నారు, పెద్దలు టి జి వెంకటేష్ గారితో మాట్లాడి తుంగభద్ర నది కాలుష్యాన్ని అరికడతాను అని హామీ ఇస్తున్నాను.
ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చినా ఇంకా వెనుకబడిపోయింది అని చెప్పుకోవడం సిగ్గు చేటు, నేను రాయలసీమ లో పుట్టకపోయినా సరే రాయలసీమ అభివృద్ధి కోసం చివరివరకు పనిచేస్తాను అని ప్రమాణం చేస్తున్నాను.
మార్పు పెద్దలు తీసుకొస్తే రాదు, పాతిక, ముప్పై సంవత్సరాల యువత తీసుకొస్తే వస్తుంది, వారు మనల్ని బయపెడతారు, అయినా సరే మార్పు తీసుకొచ్చి తీరుతాం.
నిన్న గుంటూరు లో మన ప్రచార రధాలపై రాళ్లు వేసి, మన మహిళల్ని గాయపరిచారు, మా జనసైనికుల మీద గాని, ఆడపడుచుల మీద గాని దాడులు చేసినా అక్రమ కేసులు పెట్టినా సరే చూస్తూ కూర్చొను.
ఒక వ్యక్తికి పాలన అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు, రాబోయే రోజుల్లో అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయి, అన్ని వర్గాలకు న్యాయం జరగాల్సిందే.
లక్షలాది మంది జనం వస్తుంది మార్పు కోసం,నేను జగన్ గారిలా ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అవ్వాలి అని అనడం లేదు, ముఖ్యమంత్రి గారిలా మళ్ళీ నేనే, తరవాత మా అబ్బాయి ముఖ్యమంత్రి అని అనడం లేదు, మీ అందరి జీవితాలు మారాలని కోరుకుంటున్నాను.
కర్నూలులో @PawanKalyan గారి వెంట కదులుతున్న సైన్యాన్ని సైనికులను చూస్తుంటే రాయలసీమలో కొందరికి ఏకంగా ఏళ్ల నాటి తమ రాజకీయ పీఠాలు కదులుతున్నట్టు అనిపిస్తుంది..🔥🔥#JanasenaPorataYatra pic.twitter.com/DB9EfJhrFd
— Trend PSPK (@TrendPSPK) February 24, 2019
నేను మీ జీవితాలు మార్చడానికి వచ్చాను, మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేక ప్రతిపక్షంలో కూర్చోబెడతారా అనేది మీ ఇష్టం, కానీ మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేవరకు నా పోరాటం ఆగదు.
మార్పు పెద్దలు తీసుకొస్తే రాదు, పాతిక, ముప్పై సంవత్సరాల యువత తీసుకొస్తే వస్తుంది, వారు మనల్ని భయపెడతారు, అయినా సరే మార్పు తీసుకొచ్చి తీరుదాం.
మీరు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఇంట్లో వాడిగా, మీ అన్నదమ్ముడిగా, మీ బిడ్డగా మీకోసం పరిపాలించడానికి, చనిపోవడానికి సిద్ధపడి వచ్చాను, ముఖ్యమంత్రి పదవి ఇస్తే సక్రమంగా పరిపాలిస్తాను.
ఒకవేళ మీరు ఏ పదవి ఇవ్వకపోతే జనసైనికుడిలా పోరాటం చేస్తాను, అన్యాయంపై ఎదురుతిరుగుతాను, మీకోసం పనిచేస్తాను.
మీకోసం పనిచేసేందుకు మీరు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారా లేక ఏ స్థానంలో కూర్చోబెడతారో మీ ఇష్టం, ఏ స్థానంలో ఉన్నా చిత్తశుద్ధితో పనిచేస్తాను.
We JanaSainiks are your Channels and News Papers…#JanaSenaPorataYatra #Kurnool pic.twitter.com/Y3B8NdTIZr
— తెలంగాణవాసి (Modi Ka Parivar) (@CosmicChandan) February 24, 2019